పుట:Ganita-Chandrika.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గణిత చంద్రిక.


నాల్గవ తరగతి.

1వ అధ్యాయము.

——:O:——

సంఖ్యామానము — సంజ్ఞామానము.

ఇదివరకు హిందూ సంఖ్యామానపద్ధతిలో ఒకట్లు, పదులు, వందలు, వేలు, పదివేలు, లక్ష వీనిని గురించి నేర్చితిరి. హిందూ సంఖ్యామానపద్ధతిలో లక్షకన్న పైస్థానములకు పేర్లు గలవు. అవి ఏవన - లక్ష, దళలక్ష, కోటి, దశకోటి, శతకోటి, అర్బుదము, న్యర్భుదము, ఖర్వము, మహాఖర్వము, పద్మము, మహాపద్మము, క్షోణి, మహాక్షోణి, శంఖము, మహాశంఖము, క్షితి, మహాక్షితి, క్షోభము, మహాక్షోభము, నిధి, మహానిధి, పరతము, పరారము, అనంతము, సాగరము, అవ్యయము, అమృతము, అచింత్యము, అమేయము, భూరి, మహాభూరి, అని ముప్పదియారు స్థాన సంజ్ఞలు.