పుట:Ganita-Chandrika.pdf/26

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

గణిత చంద్రిక.


ఒకనివద్ద 56 రూపాయలు ఉండెను. వరుసగా 3 దినములు దినమునకు క రూపాయల వంతున సంపాదించిన ఎంత యుండును?

(56+3 క) రూపాయలు.

ఒకనికి త రూపాయలు అప్పుయుండి క రూపాయలు చెల్లించితిని. ఇక ఎంత బాకి ?

6 రూపాయలు 'బాకీయుండి రెండు రూపాయలు చెల్లించిన 'బాకీ 6-2 లేక 4 రూపాయలు. అదే విధముగ త రూపాయలు బాకీయుండి క చెల్లించిన బాకి త - క రూపాయలు.

ఒక రూపాయకు అణాలెన్ని ? పదునారు.

రెండు రూపాయలకు అణా లెన్ని ? రెండు పదునార్లు,

మూడు రూపాయలకు అణా లెన్ని? మూడు పదునార్లు.

క రూపాయలకు అణా లెన్ని ? క పదునార్లు.

ప్రశ్హ్నలు

1. క రూపాయలకు పావులా లెన్ని? 4 క పావులాలు,

2. క అణాలకు పైసలెన్ని ? 12 క 'పైసలు.

3. క అణాలకు కాను లెన్ని ? 4 క కానులు.

4. పండు కాని. క అణాలకు ఎన్ని పండ్లు? 4క పండ్లు.