ఈ పుట అచ్చుదిద్దబడ్డది
16
గణిత చంద్రిక
దానియొక్క కారణాంకములలో దేనిచే భాగించినను శేష ముండదు.
28 కి కారణాంకము లేవి? 4x7=28 కాన 4, 7 ఇవి 28కి కారణాంకములు.
ఒక్కొక్క సంచిలో 19 రూపాయల చోప్పున 28 సంచులలో ఎన్ని రూపొయలు ఉండును ?
మొదట నాలుగు సంచులలోనివి కనుగొని అట్టివి 7. నాలుగు సంచులున్నవి గాన ఆ మొత్తమును 7చే హెచ్చించ వచ్చును.
మొదట 4చే హెచ్చించి వచ్చిన మొత్తమును 7చే హెచ్చించిన మొదటి సంఖ్యను 4x7 లేక 28 చే హెచ్చించినట్లు అయినది.
19x28 =532.
అభ్యాసము 8.
కారణాంకములచే హెచ్చించుము. 1. 586 ను 64 చే 2. 388 ను 108 చే 3. 209 ని 72 చే