పుట:Ganita-Chandrika.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి.

15


25. ఒక వస్తువును రూ 13 లకు కొని క రూపాయలకు అమ్మిన 9 రూ. లాభము. క ఎంత ?

గుణకారము -- భాగహారము.

ఒక సంఖ్యను 10 చే గుణించవలయుననిన పక్కన సున్న చేర్చవలయును. అట్లు చేయుటచే ఒకల్లు పదులుగను, పదులు నూర్లుగను మారును.

నూరుచే హెచ్చించుటకు ఏమి చేయవలయును? కనుగొనుము.

పదిపదులు నూరు. కనుక పదిచే హెచ్చించగ వచ్చిన మొత్తమును తిరుగ పదిచే హెచ్చించిన చాలును. అనగా రెండు సున్నలు చేర్చవలయును.

ఉదాహరణము:-

8x100= 800. 19 x 10=190. 9x10 = 90. 17x10=170. 28 x 100 = 2800. 39 x 100 = 3900.

కారణాంకములు.

రెండును ఐదుచే హెచ్చించిన 10 వచ్చును. కనుక 2, 5 ఇవి పదికి కారణాంకములు. 10ని 2 చే భాగించిన శేషము లేదు. 5 చే భాగించినను శేషము లేదు. ఒక సంఖ్యను