పుట:Ganita-Chandrika.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ తరగతి.

7

7

3. 7 అంకెలుగల సంఖ్యలలో మిక్కిలి చిన్నది ఏది ? 4. మదరాసు రాజధాని వైశాల్యము 15812500 చదరపు మైళ్లు, ఇంగ్లీషు, తెలుగు సంఖ్యామానములలో " చెప్పుము.

5. ఎన్ని లక్షలు ఒక మిలియను. 6. ఒక దేశమునందలి జనసంఖ్య 2,27,61,019. . ఈసంఖ్యను తెలుగుమానములోను, ఇంగ్లీష్ మానములోను చెప్పుము.

7. ఒక నూనె మిల్లును ఏర్పాటు చేయుటకు 1,22,0007 రూపాయలు పెట్టుబడి కావలయును. నూనె తయారుచేయుటకు కావలసిన గింజలను కొనుటకు 2,98,312 రూపాయలు కావలయును. తయారు అయిన చమురును 3,32,236 రూపా యలకు అమ్మనచ్చును. ఇందలి సంఖ్యలను తెలుగుమాసం ములో చెప్పుము.

8. ఒక రైతు మాగాణి భూమిని రూ 2895 లకును. మఱియొక భూమిని కూ 12310 లకును కొనెను. "రెంటిని కలిపి ఎంతకు కొననో ఇంగ్లీషు మానములో చెప్పుము.

9. ఒక భూస్వామికి వరిచేలనుండి రూ 3627, తోటల నుండి రూ 1089, మెట్టభూములనుండి రూ 649 వచ్చినవి... మొత్తము ఎంత ?