పుట:Ganavidyavinodini.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

2

నాదము హృదయమందున్నప్పుడు మంద్రమనియు కంఠమునందు మధ్యమనియు మూర్థమునందు తారమనియుఁ జెప్పఁబడును. ఇవి యొక దానికంటె మఱొకటి యొక్కువైయుండును.

నాదము ఆహతము అనాహతము అని రెండువిధములు. అనాహతనాదము నిశ్చలమనస్సు గలవానికే సాధ్యము. ఈ అనాహతనాదము గురూపదేశ మార్గమున ఋషు లుపాసించుచున్నారు. ఆహతనాదమును శ్రుత్యాదిముఖముగా తెలిసికొనినయెడల పాపము నశించి జనుల కానందము పుట్టించును. 'ఈ సంగీతజ్ఞానముచేత హరిహరాదులను స్తోత్రముజేయఁగా ధర్మార్ధకామములు కలుగును. ధనాద్యపేక్షలేక భగవంతునియందు సంగీతానుష్ఠానము చేయుటవలన నిస్సందేహముగా మోక్షమును సిద్ధించును.