పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అధ్యయనానికి ఊతాన్నిచ్చే ప్రాంతంగానూ దీనికి ప్రాముఖ్యత ఉంది. కూసుమంచి గ్రామానికి ఈశాన్యదిశగా ఈ గణపేశ్వరాలయమూ దీని ఉపాలయాలూ నెలకొనివున్నాయి. భౌగోళికంగా అక్షాంశము: 17°23'0.85" రేఖాంశము: 79°95'1.09" లపై వుంది.


ఇలా వెలుగులోకి వచ్చింది ...

కూసుమంచి గ్రామానికి సుమారు 2 కిలోమీటర్లు ఎడంగా ఊరిబయట పొలాల్లో సర్వేనంబరు 636లో కేవలం పాడుబడిన శిధిలాల్లాగా మాత్రమే ఈ దేవాలయం వుండేది. నిండా పెరిగిన పిచ్చిమొక్కలు, పురుగూ పుట్రాతో లోపటికి కాలుపెట్టాలంటేనే బయపడేలా వుండేది. పశువుల కాపర్లకో, లేదా ఊసుపోక ఆటలాడుకుందామని వచ్చేవాళ్ళకో ఆవాసంగావుండేది. 2001లో కూసుమంచి పోలీస్ స్టేషన్ లో సర్కిల్ ఇన్‌స్పెక్టరు పనిచేస్తున్న సాధు వీరప్రతాప్ రెడ్డి గారి చొరవతో దేవాలయంలో మళ్ళీ దీపం వెలిగించటం ప్రారంభం అయ్యింది. ఆయనను ఆకర్షించింది కూడా ప్రధానంగా ఈ అతిపెద్ద శివలింగమేనని చెప్తున్నారు. ఈ ఆలయాన్ని పునరుద్ధరించేందుకు తమ సిబ్బందితోపాటు గ్రామస్తుల సహాయ సహకారాలను ఆయన తీసుకున్నారు. అప్పటినుంచి నిత్య పూజలే కాకుండా కళ్యాణ మహోత్సవాలు, ఉత్సవాలూ జరుగుతున్నాయి. శివునికి ప్రీతి పాత్రమైన సోమవారం