పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గ్రామంలో శివాలయం, పెరిక సింగారం గ్రామంలో ఉన్న వేణుగోపాలస్వామి ఆలయంలోని దేవుళ్లు ప్రస్తుతం పూజలందుకుంటున్నారు. పాలేరు గ్రామంలోని ఆలయం శిథిలావస్థకి చేరటంతో గ్రామస్తులు నూతన ఆలయాన్ని నిర్మించారు. గణపేశ్వరాలయ ప్రాంగణంలోని ఈశాన్య మూలలో నవగ్రహాల ఆలయం, ఆగ్నేయంలో ఆంజనేయస్వామి ఆలయాలను ఏర్పాటు చేశారు. వేయిస్తంభాల గుడిలోనూ, రామప్ప గుడిలో కూడా రుద్రుని చిత్రించి చుట్టూ రుద్రశిల్పీకరణకు అనువైన చిత్రాలను చెక్కారు. బహుశా ఏదైనా ప్రత్యేక పద్దతిలో రుద్రుని ఆలయం చుట్టూ కూడా ఇటువంటి దేవాలయాలను నిర్మించారేమో.

రుద్రరూపధ్యాన శ్లోకం రుద్రాధ్యాయంలో ఇలా వుంది.

అథ శ్రీ రుద్రరూపాన్ ధ్యాయేత్-
శుద్ధస్పటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రగం
గంగాధరం దశభుజం సర్వాభరణ భూషితం
నీలగ్రీవం శశాంకాంకం నాగ యజ్ఞోపవీతినం...
దిగ్దేవతాసమాయుక్తం సురాసుర సమస్కృతం
నిత్యం చ శాశ్వతం శుభ్ర ధ్రువ మక్షర మవ్యయం
సర్వవ్యాపిన మీశానం రుద్రవై విశ్వరూపిణం-

రుద్రుని చుట్టూ వుండే అష్ట దిక్పాలకుల వివరాలు ఇవి. రుద్రుడు, రుద్రాలయాల చుట్టూ సాంప్రదాయకంగా వుండే శిల్పాలు, ఆలయాల గురించి అర్ధం చేసుకునేందుకు ఇది కొంతమేరకు సహకరిస్తుంది.