పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఇలా శివలింగాకారం కనిపించడం యాదృచ్చికంగా జరిగిన విషయం కాదనీ, ఆలయ రూపకర్తలు మొత్తం దేవాలయాన్నే ఒక బృహత్తర శివలింగంగా భావించి వుంటారనేందుకు మరో ఆధారం కూడా వుంది. అది ఆలయానికి దక్షిణ దిశలో వున్న ముక్కంటేశ్వరాలయం.ఈ ఉపాలయంలో మధ్యలోని గర్భగుడిలో శివలింగంమే వుంది. కానీ ఈ శివాలయపు ఆలయసముదాయం మొత్తం తూర్పుకు కాకుండా ప్రధానాలయం వైపుకు అంటే ఉత్తర దిశకు తిరిగివుంటుంది. ముక్కంటేశ్వరాలయం ముందు నిలబడి గమనిస్తే ప్రధానాలయ బృహత్ లింగ స్వరూపం గోచరిస్తుంది. గణపేశ్వరాలపు బృహద్లింగరూప రహస్యాన్ని విప్పి చెప్పేందుకే ఈ ముక్కంటేశ్వరాలయాన్ని నిర్మించివుంటారేమో అనిపిస్తుంది.

శివలింగ నిర్మాణం వెనకున్న కొన్ని సాంకేతిక విషయాలు

శివం అనే పదానికి అర్థం శుభప్రథమైనది అని. లింగం అంటే సంకేతం అని అర్థం. శివ లింగము హిందూమతంలో ఒక పవిత్ర చిహ్నం. పూర్వం శివుడిని విగ్రహ రూపంలోనే పూజించే వారు. హరప్పా శిధిలాలలో ఒక పశుపతి విగ్రహాం కూడా దొరికింది వరాహపురాణం లోని వేంకటేశ్వర స్వామి అవతారానికి సంబంధించిన గాథ ప్రకారం భృగు మహర్షి శాపం వల్ల శివుడికి లింగరూపంలోనే కానీ విగ్రహరూపంలో పూజలు అందటం లేదట.

శివలింగంలోని భాగాలు

గణపేశ్వరాలయంలోని శివలింగాన్ని మానుషలింగం అంటారు

మానుష లింగాలయిన శివలింగాలలో శాస్త్ర నిర్మాణ పద్దతిని అనుసరించి మూడు భాగాలు వుంటాయి. వాటిలో భూమిలో వుండే చతురస్రాకార భాగాన్ని బ్రహ్మభాగము అంటారు. దానిపైన అష్టదళ రూపంలో వున్న పీఠభాగాన్ని విష్ణుభాగము అంటారు. పైన స్తూపాకారంలో వున్నభాగాన్ని శివభాగము అంటారు. ఈ మూడు భాగాల పొడవులు సమానంగా వుంటే దానిని సర్వసమ లింగం అంటారు. వీటి పొడవులు వేర్వేరుగా వుంటే వాటిని