పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వుంది దీనికి ఎటువంటి కప్పులేకపోవడంతో ఓపెన్ ఎయిర్ ఆడిటోరియంలాగా వుంటుంది. రంగమంటపం మీదకు తూర్పు, ఉత్తర, దక్షిణ మూడు దిశలనుంచి మొట్లమార్గం వుంది. 12 అడుగుల వ్యాసంతో గుండ్రని శిలతో మలచిన రంగశీర్షం మధ్యంలో వుంటుంది. రంగమండపం అర్ధం, దానిఉపయోగాలు, రకాలు, కాకతీయుల కాలంనాటి రచనలలో రంగమంటపం ప్రస్తావనల గురించి కొంచెం చూద్దాం.

దేవాలయ గర్భగృహం తరువాత తూర్పువైపున వున్న విశాలమైన స్థలాన్ని ‘రంగమండపం’ అంటారు. దీనికి మూడువైపులా దారులున్నాయి. దేవుని విగ్రహానికి చేసే అలంకరణలను అంగభోగమని, రంగశిలనుంచి అర్పించే నాట్యాన్ని రంగభోగమనీ, రెండింటినీ కలిపి అంగరంగ భోగాలనీ అంటారు. గణపేశ్వరాలయంలోని రంగమంటపానికి స్తంభాలు కానీ కప్పుకానీ నిర్మించబడిలేవు. పైగా ఇంతకు ముందు స్తంభాలుండి ఇప్పుడు కూలివుంటాయన్నట్లు గుర్తులు కూడా లేవు. కావాలనే దీనిని ఓపెన్ డయాస్ లాగా నిర్మించివుంటారు. కూసుమంచి గణపేశ్వరాలయం రంగమండపం మధ్య పన్నెండు అడుగుల వ్యాసం కలిగిన వృత్తాకార శిలా ఫలకంవుంది. పూర్వం ఆలయాలలో చేసే సాంప్రదాయ నృత్యాలకు వీటిని వేదికలుగా వాడేవారు. దేవాలయాలలో జరిపే చతుఃషష్టి ఉపచారాలలో నృత్యం ఒకటి. అది దేవాలయ రంగమండపంలో జరిగేది. {{center\

నృత్తరత్నావళిలో పేర్కొన్న రంగమండపము రకాలు

జేష్టము :

ఇది 108 మూరలు వుంటుంది. కేవలం రాజుల కొరకు మాత్రమే నిర్మించబడే రంగమంటపము ఇది.దీనిలోపాటలు,వాయిద్యములూ వినపడవు.నర్తకులు కూడా కనిపించరుఅందుకే ప్రశస్తము కాదు అని పేర్కొన్నారు.

మధ్యమము :

ఇది 64 మూరలు, రాజవంశీయులకు అనుకూలమూ మరియు ప్రశస్తమూ అని పేర్కొన్నారు.

కనిష్టము :

ఇది 32 మూరలు వుంటుంది.దీనిలో ఇతరులకు ధ్వని పెద్దదై మాధుర్యము నశిస్తుందని అందువలన అప్రశస్తము అని పేర్కొన్నారు.