పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మాత్రం చాలా పెద్దదిగా వుంటుంది. సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు సరాసరి లోపటి శివలింగాన్ని ఏ అడ్డంకీ లేకుండా స్పర్శించేందుకు పెద్దవైన ద్వారశాఖలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ఇంత పెద్ద శివలింగాన్ని భక్తులు కళ్లారా చూడాలంటే ద్వారం ఖచ్చితంగా పెద్దదిగా వుండాలి.

వర్షం కురిసినపుడు జల్లు ఎక్కువగా లోపటికి పడితే లోపటంతా నీటిమడుగు అయ్యే అవకాశం వుంది. అందుకోసం ఈ ప్రవేశమార్గం పైన చక్కటి వంపుతిరిగిన చూరు(లింటెల్) నిర్మించారు. ఇది పరిమాణ రీత్యా చాలా పెద్దగా వుండటమే కాక ద్వారశాఖలలాగానే ఇది కూడ రాతి నుంచి మలచబడినదే. అదికూడా దేవాలయ నిర్మాణపు లెగోబ్రిక్ పద్దతిలోనే చాలా చక్కగా దర్వాజా పైన అమర్చారు. ఈ చూరు పైవైపు అండాకారంగానూ క్రిందివైపు పుటాకారంగానూ వుంది. ఎండావానలను కాచే గొడుగులాగానే కాక అబ్బురమనిపించే అలంకరణతో ఎలివేషన్ లాగా కూడా ఇది ఉపయోగపడింది. ద్వారశాఖల పై చెక్కిన శిల్పాలు రామప్ప ద్వారశాఖలపైనున్న శిల్పరీతినే పోలి వున్నప్పటికీ అంత నిపుణత చూపలేదు. ద్వారశాఖకూ రాతి స్థంభానికీ మధ్యనున్న యుధ్ధమదనిక శిల్పాలను పోలిన ద్వారాశాఖకూ మాత్రం ప్రత్యేకంగా వున్నాయి. ద్వారానికి రెండు వైపులా వాతాయనాలు అనగా కిటికీలున్నాయి. అవికూడా రాతితో నిర్మించినే కావడం ప్రత్యేకత.

గర్భగృహ ద్వారశాఖలు

గర్భగృహ ద్వారశాఖలు కూడా శిలాకుఢ్య స్తంభాలతోనే నిర్మించబడ్డాయి. ప్రధాన ద్వారం నుంచి లోపలికి వచ్చిన తర్వాత అర్చామూర్తికీ ముందున్న చివరి విభజనరేఖ ఇది మాత్రమే. నిర్మాణాన్ని పరిశీలిస్తే ఇది కేవలం ద్వారంగానే కాకుండా ఆలయభారాన్ని మోసేందుకు కూడా ఉపయోగపడేలా నిర్మించారని అర్ధం అవుతుంది. అందుకే మందమైన పెద్ద పట్టెడలు రెండువైపులా ధృఢంగా వుండేలా నిలబెట్టివుంటారు. ద్వారపాలక విగ్రహాలను, పౌరాణికఘట్టాలను వివరించే చిత్రాలనూ ఈ నిలువు పట్టెడలపై కుడ్యచిత్రాలుగా చెక్కి