పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

లలో నిర్మించబడివుండవచ్చని చెపుతున్న కూసుమంచి గణపేశ్వరాలయం యెక్క ఖచ్చితమైన తేదీలు నిర్మించినవారి వివరాల ఆధారాలకోసం పరిశోధించాల్సివుంది.

కూసుమంచి గణపేశ్వరాలయం నిర్మాణ పరంగా పాలంపేట రామప్పదేవాలయాన్ని, వరంగల్ లోని వేయిస్తంభాల గుడిని పోలి వుంది. ఈ ఆలయ నిర్మాణానికి ఆనాడు కూలీలు, పనివారు వరంగల్ ప్రాంతం నుంచి వచ్చారట. గణపతి దేవునికి ‘‘నానావర్ణ వరమండలీకరగండ’’ బిరుదున్నట్లు ప్రతాప చరిత్రము(పుట 34), కాసె సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర(పుట 127) లలో ప్రస్తావనలున్నాయి. గణపతిదేవునికి రాజ్యనిర్వహణలోనూ, పరిపాలన సంబంధమైన విషయాలలోనూ సహాయకులుగా అన్ని కులాలకు సంబంధిచిన వారినీ నియమింపజేసుకున్నాడనేది దీనివల్ల తెలియవస్తోంది. అందుకే ఈ దేవాలయ నిర్మాణం కేవలం వర్ణ ప్రాతిపదికమీద కాకుండా నైపుణ్యం, కౌశల్యం ప్రాతిపదికన చేయించి వుంటారని భావించవచ్చు.


కాకతీయ నిర్మాణం అనేందుకు కొన్ని సూటి ఆధారాలు


కాకతీయ దేవాలయాలలో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు ఈ దేవాలయం కాకతీయులకాలం నాటిదే అయివుండవచ్చని చెప్పేందుకు ఆకరాలుగా కనిపిస్తున్నాయి.

1. ముక్కంటేశ్వరాలయంలోనూ, వేణుగోపాలస్వామి ఆలయంలోనూ విశిష్ట రీతిలో చెక్కిన స్తంభాలు.
2. ముందుకు పొడుచుకు వచ్చినట్లుండే క్రింది గుమ్మాలూ, పై గుమ్మాలూ
3. గర్భాలయ ముఖద్వారం పైన లలాట బింబంగా గజలక్ష్మి రూపం
4. గర్భాలయంలో అర్చామూర్తికి పైన వున్న చక్రము లేదా రాతిపద్మం. దానిచుట్టూ ఒక పద్దతిలో చెక్కిన పద్మదళాలు.
5. అంతరాళము
6. పై కప్పుకు చెక్కిన పద్మదళాలు
7. రంగమండపము