పుట:Ganapeswaralayam - K. Srinivasa Rao.pdf/12

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పడేది కాదు అంటుంటారు. కథల్లోనూ, వ్యాఖ్యానాల్లోనూ ఎంత నిజం ఎంత కల్పితం వుందనేది నిర్ధారించలేకపోయినప్పటికీ చరిత్రను అర్ధం చేసుకునేందుకు ఏ చిన్న ఆధారమైనా విలువైనదే. ఈ కథ మొత్తంలో క్రేన్లూ, ప్రొక్లెయిన్లూ లేని ఆ కాలంలో కేవలం మానవ శక్తితో ఇంత పెద్ద పెద్ద రాళ్లను ఇంతదాకా ఎలా తరలించారు? వాటిని ఒక వరుసలో చెక్కముక్కలు పేర్చినంత సులభంగా, సున్నితంగా, ఖచ్చితంగా వీటిని ఎలా పేర్చారు అనేది అతి పెద్ద ఆశ్చర్యమే. నిశితంగా పరిశీలించినపుడు మరికొంత ఫినిషింగ్ పనులు పూర్తికాకముందే ఏవో బలమైన కారణాల వల్ల ఆలయ నిర్మాణం అర్ధంతరంగా ఆపివేసి వుంటారేమో అనే అనుమానం కలుగుతుంది.


కూసుమంచి ఆలయ శిల్పాలూ, శిల్పరీతి

శిల్పకళను ఆంగ్లంలో స్కల్ప్చర్ అంటారు. లాటిన్ పదం స్కల్పెరీ అంటే కోయు అనే అర్ధం. ప్రకృతిలో కనిపించే విషయాలనే కాదు, మానవుని హృదయంలో పుట్టే భావాలకూ రూపకల్పనం చేయటం ఈ కళలోని ప్రత్యేకత. ఒక జాతి సంస్కృతి, నాగరికత, కళా వైభవాలను వెల్లడి చేసే శక్తిదీనికుంది. అందుకే తరాల వెనకటి వారి ఆలోచనలకు ప్రత్యక్షసాక్షాలుగా నిలచిన ఈ స్వల్పఆధారాలను అమూల్యమైనవిగా భావించాలి. వీటిద్వారా వాళ్ళని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయకపోతే కోసప్రాణాలతో మిగిలిన అవకాశాన్ని పూర్గిగా పోగొట్టుకున్నట్లే అవుతుంది.

కాకతీయులు వాస్తుపద్దతులను సాంప్రదాయక పద్ధతులను అనుసరిస్తూనే స్థానిక సాంప్రదాయ శైలిని తమ అభిరుచులను జోడించారు. అలంకరణలలో కాకతీయ సంస్కృతినీ, పద్ధతులను తెలిపే శిల్పాలను చేర్చటంలో ప్రత్యేకత చూపారు.

దేవాలయం కాకతీయుల కాలానిదే అని నిర్ధారించుకునేందుకు మనకి పటిష్టంగా కనిపించే ఆధారం దేవాలయ నిర్మాణ రీతి. దీనిని జాగ్రత్తగా పరిశీలించడం ద్వారా ఈ విషయాన్ని అర్ధంచేసుకోవచ్చు. ఈ ఆలయం రామప్పఆలయ నిర్మాణాన్ని చాలా వరకూ పోలి వున్నప్పటికీ ఆలయంలో రాళ్ళను అమర్చిన విధానం రామప్పకంటే భిన్నంగా వుంటుంది. పాలంపేటలో ఆలయంకోసం శిల్పులను ఎంచుకునేందుకు గణపతిదేవుని గురుతుల్యుడు విశ్వేశ్వరశర్మ ఒక పరీక్ష పెట్టారట. ఆ పరీక్షలో కూసపు కొలత, రంధ్రపు కొలతలను ముందుగా తీసుకుని. వాటిని వేర్వేరుగా తయారుచేయాలి. తొలిప్రయత్నంలోనే అవి కొంచెం వదులు కానీ, బిగుతుగానీ కాకుండా ఖచ్చితంగా బిగించగలగాలి. దీనిలో