పుట:Ganapati (novel).pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

96

గ ణ ప తి

కొంత హిరణ్యము సమర్పించుచు దిక్కుమాలిన కుటుంబము నకుఁ దగిన సొమ్మతనకి భగవంతుఁ డీయలేదు. కాని యిచ్చిన పక్షమున నతఁడు గూడ దానికొక గొప్పమేడ మేటిసాహుకారులు తమ ప్రియురాండ్రకు గట్టించిన విధముగఁ గట్టించి యుండును, కోరినంత ధనమీయ లేకపోయినను గంగాధరుడుఁ సింహాచలమునకు శక్తివంచనలేక యుపచారములు చేయఁ దలఁచి తల దువ్వుట, తలయంటి నీళ్ళుపోయుట, గారెలు, బూరెలు మొదలగు పిండివంటలు స్వయముగా వండిపెట్టుట గుడ్డలుదుకుట, యంట్లుతోముట మొదలగు కార్యములు శంకాతంకములు లేక చేసి దానిమెప్పువడసి ధన్యుఁడగుచుండును. అతని యుదారభావమును దీని బట్టియే మీరు గ్రహింపవచ్చును. దానగ్రజన్ముఁడైన బ్రాహ్మణుఁడని గర్వింపక సందేహింపక యది నీచకులజు రాలని యేవగింపక యీపని యాపని యనక శంకింపక యట్టి యుపచారము చేసినవాడు సామాన్యుడా? కాకినాడలోనున్న కాలమున గంగాధరుఁడు కనబఱచిన ప్రజ్ఞనుగూర్చి యొకటిరెండు మాటలు చెప్పవలసియున్నవి. గంగను మోయుటచేత గంగాధరుఁడు సాక్షాత్తు గంగాధరుఁ డయ్యెనుననుట కల్పనాగౌరవముకాదు. శివుఁడు తలపై నిడుకొని గంగను మోసెను. మన గంగాధరుఁడు కావడిలో నిడుకొని గంగను మోసెను. ఆ గంగాధరుడు శూలము ధరించుటచేత శూలియయ్యెను. ఈ గంగాధరుఁడు కడుపు మానమెఱుఁగక తినినందున సంభవించిన