పుట:Ganapati (novel).pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

82

గ ణ ప తి

అర్థప్రాణములు నీచేతనే బెట్టితిని. నిన్నే నమ్ముకొంటిని. లోకులు కొందఱు మనకు సొమ్మియ్యవలెనని చెప్పితివిగాదా. ఆ సొమ్మేమైనది? పుట్టెడు దుఃఖముతో నున్నదానను నేనేమొగము పెట్టుకొని నిన్ను వ్యవహారము విషయమై యడుగనని నీవే నాకప్పగింతు వని యింతకాల మూరకొంటిని. నీదారిని నీవు వెళ్ళుచున్నావు. నాగతియేమిగా"నని అడుగుటయు నన్నప్ప హిమవత్పర్వతమువంటి ధైర్యహీనుఁడు గాక నిబ్బరమైన మనస్సుతో నిట్లనియను. "అమ్మాయీ! నీ భర్త మృతినొందు నప్పటికి నీకు నాలుగైదువందల రూపాయలు లోకులవల్ల రావలెను. ఎక్కువవడ్డీ కాసపడి పాపయ్య పైమీఁద బట్టలులేని ఫకీరు కప్పిచ్చెను. ఆ సొమ్ము చెట్టెక్కెను. ఒకఁడైనను నియ్యలేదు. నేను నానాకష్టములుబడి రేయింబవళ్ళు తడిమన్ను పొడిమన్నగునట్లు వాళ్ళ యిండ్లచుట్టుదిరిగి రెండువందల రూపాయలు వసూలుచేసినాను. ఆసొమ్ము మన మీయెనిమిది మాసములనుండి తినివేసినాము. నీగతి యేమందువా? ఇల్లు తనఖాబెట్టి నూరు రూపాయ లెవరివద్దనైన బదు లిప్పించెదను. ఆ సొమ్ముతో మీరిద్దఱే గనుక నొక సంవత్సరము కాపురము చేసితిరా తరువాత దేవుడున్నాఁడు. ఈ లోపుగ నేను కాలు చెయ్యి గూడదీసుకొని నీయప్పు నేనే తీర్చి నీకేదో యుపాధి గల్పించెదను. నిన్ను నేను వదలిపెట్టి యూరకుందునా? నాకవతల వ్యవహారమొకటి మించిపోవుచున్నది. గనుక నన్ను వెళ్ళనీ. నీ భర్త