పుట:Ganapati (novel).pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

70

గ ణ ప తి

పోవుటకంటె శ్మశానములో నిద్రపోవుట మంచిది. నన్ను పలకరించవద్దు. నా నోరు మంచిదికాదు. మీయిద్దఱిపరువు సమానము గనుక మీకు కలిసినది, నాకుమీతో గలియదు. ఈ యాఱుమాసములు విధిలేక ముండ్లమీఁదు న్నట్టున్నాను. వెనుకదిక్కు లేనివారి నొక్కనిని విడిచి వెళ్ళినానను నింద నానెత్తిమీఁద లేకుండ మీ నోటితో మీరే వెళ్ళు మని చెప్పినారు కావున నింద నామీఁద లేకుండ సరిపోయింది. నన్ను మీరాపవద్దు, ఇదిగో వెళ్ళుచున్నాను” అని విసవిస నడువసాగెను. నిద్రామధ్యమున మేలుకొలుపఁ బడుటచేఁ గొడుకుఁ గూతురుఁ గన్నులు నలుపుకొనుచు వెంటఁ జనిరి. బిడ్డలవెనుక భార్య యరిగెను. అట్లువారు పయనమై రెండవ వీధికరిగి యొక్క యరుగుమీఁద బండుకొని తెల్లవారుజామున లేచి మరల పయనమై రేవుదాటి స్వగ్రామము జేరిరి. నాఁడు మొదలుకొని పాపయ్యకు మామగారికి నోటిమాటయు గంటిచూపును లేవు. ఉత్తర ప్రత్యుత్తరము లంతకుముందే లేవు. పాపయ్య మామగారి పోక శనిగ్రహవిమోచన మట్లు తలంచి తల తడిమి చూచుకొనెను. వివాహమైన రెండు సంవత్సరములకు భార్యయుక్తవయస్కురాలైనదని పాపయ్యకు వర్తమానము తెలిసెను. కాని మామగారు శుభలేకవ్రాయలేదు. పాపయ్య స్వయముగావెళ్ళి నిజస్థితిఁ గనుగొని యా వార్త నిజమయ్యెనేని పునస్సంధానము చేయవలసిన దని యడుగఁ దలఁచెను. కాని యల్లు డదివఱకు చేసిన మహాప