పుట:Ganapati (novel).pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

రాఁగలనా? నేను కూటికి మొగము వాచలేదు. గుడ్డకు మొగమువాచలేదు. అల్లుఁడు పదియవగ్రహ మన్నమాట నాకిప్పుడర్థమైనది. నేటితో నాకు నాపిల్లకు ఋణముదీరిన” దని గుమ్మము దిగెను. ఆపలుకులకు మిక్కిలి కవలి పాపయ్య పునహానుండి తెచ్చిన దుడ్డుకఱ్ఱతో రెండుదెబ్బలు దీయఁదలఁచెను. కాని నూతి నరసింహ మతనిని వారించి మెల్లగా నన్నప్పతో నిట్లనియె “అన్నప్పగారూ! మీరు కొంచెము శాంతించవలెను. మీ యల్లుఁడు విశేషముగ ధనమున్న సంసారికాఁడు గనుకను నతని క్షేమము గూడ మీరు చూడవలయును గనుకను రెండు సంసారములు నతటు భరింపలేడు గష్టనిష్టురములు చెప్పుకొనుటకు మీరుతప్ప యతనికి మఱెవ్వరు లేరు గనుకను నేను మీ యుభయులకు గావలసిన వాఁడను గనుకను నాచేత రహస్యముగఁ దనసాధక బాధకములు వర్తమాన మంపినాఁడు. దీనికి మీరింత కోపపడవలసిన పనిలేదు. ఈ రాత్రియె వెళ్ళవలసిన యవసరము లేదు. స్థిమితముమీఁదఁ వెళ్లవచ్చును. అర్ధరాత్రమువేళఁ జిన్నపిల్లలను దీసికొని మీరెక్కడకు వెళ్ళగలరు? కాబట్టి యీరాత్రి యిక్కడ పండుకొని రేపుభోజనముచేసి వెళ్లవచ్చును నిలువుడి.” అని వేడుకొనుటయూ నన్నప్ప దెబ్బతిన్న త్రాఁచువలె నాగ్రహము రెట్టింప “నీ రాత్రిగాదు కదా గడియ యిక్కడుండను. అన్నంభొట్లవా రంటే యొక్క మాట మీఁదనె నిలఁబడగలవారు. ఇతని యింటిలో నిద్ర