పుట:Ganapati (novel).pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

గ ణ ప తి

గుణగ్రహణపారీణు లగుటచే మోరుచేతుల దాని యభినయమునకు సత్తిదాని గానవైఖరికిని మహానందభరితులై రాత్రి ప్రొద్దుపోవు వఱకు నుదయమున రెండు జాముల వరకుఁ మేజువాణిఁ జేయించుచుండిరి.

శుద్ధవైదికులగుటచే రసికత నెఱుంగక యిట్లువారు సంతసించిరని కొందరు పడుచువాండ్రన సాహసించిరి. కాని యా మాటలు మీరు నమ్మగూడదు. వారల్ప సంతోషు లనియు గుణమెంతవరకు నున్న నంతవఱకు గ్రహించి యానందించువారనియుఁ దలంపవలయును. వివాహము ముగిసెను, వివాహమైనందుకు మనపాపయ్య మిక్కిలి సంతసించెను. కానియతని మనస్సులో నొకవిచారముండెను. అత్తవారింటికి మనుగుడుపునకుఁ బోవుట మొదలగు ముచ్చటలు తీరుట కవకాశము లేక పోయినందున నది గొప్ప కొరఁతగా నతఁ డెన్నుకొనుచు వచ్చెను. అత్తమామలు వివాహమైన తరువాతగూడ గొంతకాలము మందపల్లెలోనె యుండి యల్లుడు తమయింటఁ జేయవలసిన మనుగడుపు తామే యల్లుని యింటఁ జేయఁసాగిరి. చూచువారికిఁ బాపయ్య మామగారై నట్లు నన్నప్పయల్లుఁడైనట్లుండెను. తనకు సరియైన గౌరవము జరగలేదని యల్లుడు బెట్టుజేయుట కవకాశము లేక పోయెను. కాని యన్నప్ప నడుమ నడుమ కొంతబెట్టుసరిచేసి యన్నముమాని యింటికి రాక తగవులాడఁజొచ్చెను. పాపయ్యమామగారిని బ్రతిమాలి యింటికి తీసికొని రావలసి వచ్చెను. అన్నప్ప వివాహమైన