పుట:Ganapati (novel).pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

గ ణ ప తి

బాపయ్య యధిక శోభస్కరముగ వివాహము జేసికొనఁదలచిఁ యైదుదినంబులుం బల్లకినెక్కి యూరేగెను. పాపయ్య దీర్ఘకాయుఁ డగుటచే బల్లకిలోఁ గూర్చుండినప్పుడు చిన్న చిక్కు సంభవించెను. అతని తలకు దండియు దండిపైఁ బఱచెడు పింజరియుఁ దగులుచుండుటచే నతఁడే పెండ్లికూఁతురు భావము వహించి తలవంచుకొనవలసినవాఁ డయ్యెను. అందుచేతఁ బల్లకిలోనున్న సమయములో నతనిని జూచినవారు మెడగుళ్లు వంగినవని కొందఱు, గూనివచ్చినదని కొందఱు, కాదు కాదఱువదియపడిలోఁ జిన్నపిల్లను వివాహమాడినందుకు సిగ్గుపడి తలవంచుకొన్నాఁడని కొందరు దోచిన విధముగననిరి. దీర్ఘకాయమునకుఁ దోడుగ నతఁడు లావుగలవాఁ డగుటచేతను, గూనంత బొజ్జగలవాఁ డగుట చేతను, దండాడింపు సమయమునఁ బెద్దచిక్కు సంభవించెను. వచ్చిన బంధువులలో మిత్రులలో బరిచితులలో నతని నెత్తుకొని దండాడింపు చేయఁగలవారు లేకపోయిరి. పాపము నేఁటికాలమునకుఁ బాపయ్య వొక యింటివాఁ డగుచున్నాఁడుగదా, యతని ముచ్చట మాత్రము తీరవలదా యని యొక బంధువుఁడు సాహసించి పెండ్లికుమారు నెత్తుకొని రెండు గంతులు వేయునప్పటికి నూనెసిద్ధివలెనున్న పాపయ్యబొజ్జ జారిపోవ లక్క గుమ్మడికాయవలె నతఁడు క్రింద గుభాలునఁ గూలెను. చట్ట నొప్పిపెట్టెను. పిమ్మట నతఁ డొకయరుఁగుమీద గూర్చుండి పెండ్లికుమార్తె మీఁద బగ్గుండ జల్లి యా యుత్సవ మైన