పుట:Ganapati (novel).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

v

వ్యక్తుల, సంఘముల సాంఘికోపయుక్తత నిలచునే గాని లేనిచో క్షీణత సర్వదా తప్పదని వ్యంగముద్వారా యీ నవల సూచించుచున్నదని విజ్ఞుల అబిప్రాయము. ‘గణపతి’ నవల చదివి, గణపతివలె హాస్యాస్పదులు కాకుండుటకు యత్నించుమనియే కవిగారి సందేశమని ఊహింపవచ్చును.

ఆంధ్రమహాజనులు మా కృషికి దోహద మొనర్పగోరుచు సెలవు దీసికొందును.

సత్తారామేశ్వరం
(వయా) పెనుమంట్ర
పశ్చిమ గోదావరి.

ఇట్లు,
వెలగల వీర్రెడ్డి.
10-3-1966