పుట:Ganapati (novel).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

54

గ ణ ప తి

తిన్నపక్షమునఁ దమ పితృ దేవతలు తప్పక మోక్షపదమున బ్రాపింతురని మహారాష్ట్ర బ్రాహ్మణులకు నమ్మిక గలదు. అందు గౌతమీ గృష్ణవేణీతీర బ్రాహ్మణులు అన్నచో వేరు కొరతలేక తమపెద్దల నిమిత్తము వైకుంఠద్వారములు తెఱచి యుండునని వారి దృఢవిశ్వాసము. అట్టివా రెవ్వ రిదివఱకు వారికి దొరకక పోవుటచే నేక వాహపిండము లగ్నిహోత్రము పాలగు చుండెడివి. పాపయ్య వెళ్ళిన తరువాత నట్టి కొరత తీరిపోయినది. వైకుంఠ కైలాసలోకముల ద్వారములు ముద్దలు మ్రింగుటకు తెరవఁబడిన పాపయ్య నోరువలెనే యెల్లప్పుడు తెఱవఁబడి యుండును, అగ్ని హోత్రునినోట కరక్కాయ గొట్టి పాపయ్య ముప్పది రెండు ముద్దలు నేతిలో ముంచిన ముద్దకు రెండు వరహాలు మూడువరహాలు సమయముకొలదిఁ లాగివేయుచుండును. సర్వభక్షకుఁడైన యగ్నిహోత్రునకైనను నెయ్యిసరిగా జీర్ణముకాక యజీర్ణము చేసియుండెను. కాని పాపయ్య యెన్నఁడు నజీర్ణ మెఱుగడు. పూర్వపువారు భయముచే రహస్యముగ దినుచు వచ్చిరి. పాపయ్య కట్టి భయములేదు. కావున నతఁడు బహిరంగముగఁ దినుచు వచ్చెను. పాపయ్య నమ్మినదానిని సరిగ నాచరించునట్టి మహాశూరుఁ డని చెపుట కేమి సందియము కలదు? ఈ విధముగ నిర్భయముగ రెండుపనులు నిటీవల ననేకులు చేసిరి. కాని వారందఱు పాపయ్య శిష్యులే. అట్టివారందఱుఁ బాపయ్య పేరు చెప్పి దీపము బెట్టి మొక్కుకొనవలెను. అది యతఁడు