పుట:Ganapati (novel).pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

53

ఈ సారికె మే మింత ఘోరదుఃఖ మనుభవించుచుండ మఱి యొకసారి యిటువంటిది రావలయు నను చున్నావా?” యని వారు దూషణపూర్వకముగ నడుగుటయు నతఁ డిట్లు ప్రత్యుత్తర మిచ్చును. “ఏమంత ఓగాయిత్యము, ఈ పోయిన వాఁడొక్కఁడు తప్ప మీ యింట మఱియెవ్వరు జావరా. ఉట్టిఁ గట్టుకొని యూరేగుదురా? చిరకాల జీవులా యేమిటి? దేహములుకాని యివి లోహములు కావుగదా “జాతస్యమరణం ధృవం” అను మాట వినలేదా? ఎప్పటికైన మీరందఱు నాచేతిలోఁ బడువారె.” అతనితో వాదముఁ జేయుట కార్యభంగముఁ జేసికొనుట యని యెవ్వరు మాటలాడేవారుకారు. ఈ శవదహనమునకుఁ దోడుగ నేకమహా పిండ భక్షణ మతనికి విశేషధనమును గూర్చెను. బ్రాహ్మణుఁడు మృతినొంది నప్పుడు ముప్పది రెండు చిన్న చిన్న యన్నపిండములు నేతిలోముంచి బ్రాహ్మణునిచేతఁ దినిపింపవలయునని ధర్మశాస్త్రముగలదు. అదె యేక వాహమందురు. అవితినుట మిక్కిలి తప్పు. గొప్ప యమంగళము, అందుచేత నవి తినుట కొప్పుకొనరు. అందుచేత నెల్లవారు నవి యగ్ని హోత్రమున హుతము సేయుదురు. ఎక్కడో దేశాన కొక్కఁడు మహాశూరుఁడు బయలుదేఱి పిండమునకొక్కొక్క వరహాపుచ్చుకొని యవి తిని పదిమంది తిట్టి కొట్టుదురను భయమున నెవరికి గనఁ బడకుండ రాత్రివఱ కేదో గదిలోఁ గూర్చుండి పాఱిపోవుచుండును, ఆ పిండములు బ్రాహ్మణులు