పుట:Ganapati (novel).pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

52

గ ణ ప తి

కొని తిను వంటకాపువలె శ్మశానమునకే పది రొట్టెలు తెప్పించుకొని యెట్లో తీరికఁ జేసికొని యారొట్టెలు నోటిలో వేసికొని మరలఁ బనిచేయ తటస్థించుచుండును. మూరెడేసి పొడుగు పొగచుట్టలు నోట వెలుఁగుచున్న సమయములో పాపయ్యను శిష్యులను రాత్రులు దూరమునుండి చూచువారు కొఱవిదెయ్యములు శ్మశానములో విహరించు చున్నవని పలుమాఱు భయపడి పరుగులెత్తుచు వచ్చిరి. అన్నివృత్తులలో ధర్మమున్నట్లె పాపయ్యవృత్తిలోఁగూడ కొంత ధర్మముండెను. పేదపీనుఁగుల నప్పుడప్పుడు మూల్యము గొనకుండ నతఁడు తీసికొని వెళ్ళుట కలదు. తన యనిష్టుల కడను ధనవంతుల యొద్దను నెక్కువధనము గ్రహించుట కలదు. ఒకరి కడ నెక్కువ, యొకరికడ తక్కువ యేల తీసికొందువని యెవరైన నడిగినప్పు డది వ్యాపారము; సమయము కొలఁది బేరము ధాన్యాదులధర నేఁడు పుట్టి యిరువది; యెల్లుండి ముప్పది యుండగూడదా” యని వారి వాదములు ఖండించుచుండును. శవమునకు నాలుగు వరహాలు నెనిమిది వరహాలు పదివరహాలు పుచ్చుకొనుటయెగాని, తక్కువ లెక్కలేదు. మఱియు వరహాల లెక్కయెగాని చిల్లర లెక్కలేదు. లోభత్వము చేతను ధనహీనతచేతను గొందఱు ప్రేతబంధువులు సహాయము చేయుమని వేడినప్పు “డీసారి గాదు మరియొక సారి చూడవచ్చును లెండి” యని బదులు చెప్పుచుండును. అనవుడు వారది యమంగళముగనెంచి “ఛీ యిదియేమయ్యా!