పుట:Ganapati (novel).pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

49

దెలివిమాలినవాండ్రు కొందఱు పాపయ్య పరోక్షమునను నెట్టయెదుటను నిందించి కొన్ని ప్రశ్నలడుగుచు వచ్చిరి. అందుగొన్ని ప్రశ్నలివి. “నీ వీ వృత్తినేల యవలంబించితివి? పుణ్య మందువా, సొమ్ము దీసికొనకుండ శవదహనము జేసిన పక్షమున నది పుణ్యము. దిక్కులేని శవములుఁ గాల్చుట పుణ్యము. నీవు మోయుశవములు వెనుకదిక్కుగలవె. అవి యనాధ ప్రేతలుగావు. ఆంధ్రులకు నీమూలమునఁ దలవంపులు వచ్చుటలేదా?” అటువంటి వెఱ్ఱివెఱ్ఱి ప్రశ్నలకుఁ దగినట్లు నతఁడీ క్రిందివిధమున సమాధాన మిచ్చెను. “బ్రతికియున్న వారికి దిక్కుండును కాని పీనుఁగులకు దిక్కెక్కడుండును. కాబట్టి శవము లన్నియు ననాధప్రేతలే. వారికిమోసెడు వారే దిక్కు. మేమే వారికి గతి. ఇది గౌరవమైనవృత్తి. నీళ్ళు మోసి వంటలుచేసి గోడలు పెట్టి యిండ్లు నేసి మనుష్యులెట్లు సంపాదించుచున్నారో నేను గూడ భుజములు కాయలు కాయునట్లు శవములను మోసిమోసి కష్టపడి చమట యోడ్చి సంపాదించుచున్నాను. నాసొమ్ములో గ్రుడ్డిగవ్వయైన నన్యాయార్జితము లేదు. అంతయు న్యాయార్జితమె. నాలుగు మాటలు చెప్పి నాలుగు గడియలలో నాలుగువందలో నాలుగువేలో గడించు ప్లీడరు డబ్బుకంటె నానా కశ్మలవస్తువుల నమ్మి సొమ్మార్జించు వర్తకుని డబ్బుకంటె పండినను మండినను దప్పక సొమ్ము పుచ్చుకొను సర్కారు సొమ్ముకంటె వడ్డి వ్యాపారముజేసి మళ్ళు మాన్యములు కొంపలు గొడ్లు