పుట:Ganapati (novel).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

iv

లోకము, పత్రికాప్రపంచము, పండితవర్యులుకూడ యీ గ్రంథము నెడ మంచి అభిప్రాయము నిచ్చియున్నారు. గతములోని 1250 శ్లోకములకు మరి 750 కూడ చేర్చి, గ్రంథమును మరింత శోభాయమానముగా రెండవ కూర్పులో తెచ్చుచున్నాము. ఇందులకై బహుపరిశ్రమ గావించి, యీ మార్పులు, చేర్పులు గావించిన శ్రీ మహీధర జగన్మోహనరావుగారికి కృతజ్ఞులము. మా గ్రంథమండలికి గౌరవసంపాదకులుగా ఉండి, వారు గావించుచున్న సహకారము అనన్యమైనది. ఒక్కమాటలో చెప్పాలంటే వారి సహకారమే మే మీ సేవలు గావించుటకు ముఖ్యకారణము అని చెప్పిన చాలును.

ఇక యీ నవలను గురించి నాలుగు మాటలు, ఆంధ్రదేశములో గోదావరీతీరస్థమైన కోనసీమ యీ నవలకు ప్రధానరంగము. కోనసీమ బ్రాహ్మణులు విద్యావిజ్ఞానములకు సుప్రసిద్ధులు. కాని యీ గ్రంధములో వర్ణించబడిన గణపతివంశచరిత్ర ఏమాత్రమున్నూ ప్రతిష్టాకరమైనది కాదు. బ్రాహ్మణులలోని అతినికృష్టమైనవిగా దీనిలోని పాత్రలను మనము తీసికోవచ్చును. అట్టిపాత్రలను ప్రవేశపెట్టుటవల్ల గ్రంథకర్త సాధించదలచిన ఆశయమేమి? పాఠకుల మనస్సులలో నవలలోని పాత్రలపట్లనూ మెత్తంగా బ్రాహ్మణులమీదనూ అనాదరమును, ఏహ్యభావమును కలిగించుటకా? లేక మరొక మహదాశయ మేమైన దీనివల్ల సాధించుటకా?

ఈ ప్రక్రియ తెలుగుభాషలో నూతనమనియే చెప్పదగును. పాశ్చాత్యనవలలో సుప్రసిద్ధమైన “డాన్ క్విక్జోట్” ద్వారా సాధించ దలచిన కవి సాంఘిక పునరుజ్జీవనమునే చిలకమర్తివారు దృష్టియందిడుకొని, గణపతిపాత్రను సృష్టించిరని తోచును. పాతసమాజములోని విలువలు, యోగ్యతలు మారినప్పుడు కాలానుగుణ్యమైన నూతనమార్పులు సాధించిన