పుట:Ganapati (novel).pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48

గ ణ ప తి

తర్కవ్యాకరణ జ్యోతిష వేదాంతాది శాస్త్రములు నేర్చి పాఠము చెప్పుటకును గొన్ని క్రతువులు చేయుటకును మాత్రమే బహుసమర్థులనియుఁ దదితర వ్యాపారములకు వారనర్హులనియు దేశమున నొక గొప్ప యప్రతిష్ట కలదు. పాపయ్య యవలంబించిన వృత్తి యాంధ్రులకు సంభవించిన యా గొప్ప యప్రతిష్టను దొలఁగించునదికూడ నయ్యెను. ఆవృత్తి కధమపక్షమునలుగురైన నుండవలయును. గాఁబట్టి పాపయ్య తాను వెళ్ళినకొలఁది దినములకె తనవలెనే గంపంత యాశ పెట్టుకొని తన వలెనే భగ్నమనోరధులై యిందందు తిరుగులాడుచున్న మఱి మువ్వురను శిష్యులుగ స్వీకరించెను. ఆ నలుగురుఁ గలిసి తాము ప్రత్యేకముగ యజ్ఞములు చేయలేకపోయినను కోటియజ్ఞఫలప్రదమైన వ్యాపార మారంభించిరి. “అనాథప్రేత సంస్కారరేణ కోటియజ్ఞ ఫలం లభేత్” అని యార్యోక్తి కలదు. దిక్కులేని శవములను గాల్చుటచేత కోటియజ్ఞ ఫలము లభించునని యా వాక్యమున కర్థము. అది పుణ్యజనోచితమైన వృత్తియని పాపయ్య దాని నుపక్రమించెను. మొట్ట మొదట నతఁడు ధరలు చవుకగానే యుంచెను. కాని పనితగిలిన కొలఁది ధరలు హెచ్చింపవలసి వచ్చెను. అటువంటివృత్తి నవలంబించుటకు బురికొల్పిన యతని నిపుణత, బుద్ధిఁ జూచి యోర్వలేకను నాంధ్ర బ్రాహ్మణులు తక్కిన వ్యాపారములకు సమర్ధులుకారని లోకమున నున్న యప్రతిష్ఠను దొలఁగించుటకుఁ దగినట్లు కృతజ్ఞులు కాకను