పుట:Ganapati (novel).pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

46

గ ణ ప తి

ములు లేవు. వీళ్ళు వట్టి శూద్రులు, పంక్తిబాహ్యు” లని చాటునఁ దనమిత్రులతోఁ జెప్పుచుండెను. ఏల యని వారడిగిన నతఁ డిట్లు ప్రత్యుత్తర మిచ్చును. “వితంతువులెగాని మనదేశములో రొట్టెలు తినరు. ఈ దేశములో మగవాండ్రుగూడ రొట్టెలు తిందురు. కాన వారు గూడ వితంతువులే, భోజనకాలమందు మహారాష్ట్రులలో దృష్టిదోషములేదు. మనదేశములో వేదపండితుఁ డన్నమాట యక్కఱలేదు. ఎటువంటి బ్రాహ్మణుఁ డైనను శూద్రుఁడు రవంత తొంగిచూచినప్పటికి బ్రాహ్మణుఁ డన్నము వదలి పెట్టి లేచి వెళ్ళును. ఈ పాపిష్టి దేశములో బ్రాహ్మణుఁడు భోజనము చేయుచుండఁగా శూద్రుఁడు చూచుటయెగాక ఆ గది లోనె తానొక విస్తరి వేసికొని వేరు పంక్తిలో బ్రాహ్మణుని కెదురుగఁ గూరుచుండి శూద్రుఁడు భోజనముచేయును. ఈ దేశములో వట్టి మాలకూడు. అటువంటి పాడుదేశములో నీ వెందుకున్నా వందురేమొ కాలము తప్పి వచ్చినప్పుడు వసుదేవుఁడు గాడిదకాళ్ళు పట్టుకొన్నాడు. పొట్ట గడవక వీళ్ళనాశ్రయించవలసివచ్చినది. అదిగాక మరాటివాండ్రు పుల్లాకులలోఁ దినునట్టివాండ్రు; ఎట్లందురా? మనవలె వా రాకులలో భోజనము సేయరు. పళ్ళెములలోను గిన్నెలలోను తిందురు. అవి కడిగి దాఁచికొందురు. కాని పాఱవేయరు. తిని పాఱవేసినవి పుల్లాకులు కావా?” రహస్యములో నిటువంటి సంభాషణలు సేయుచున్నను బహిరంగముగఁ బాపయ్య