పుట:Ganapati (novel).pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

45

లగునూరుగాయలను గోంగూరపచ్చడి తోటకూర బచ్చలకూర మొదలగు పులుసులు బెల్లపుటరిసెలు మినుపగారెలు వీశె బూరెలు గుమ్మడికాయ ధప్పళము మొదలగు తెనుఁగు వంటకములకు రుచిపడిన పాపయ్య నాలుకకు మహారాష్ట్ర దేశపు రొట్టెలు పలుచని పప్పులు కారములేని పచ్చళ్ళు మొదట నచ్చినవికావు. పచ్చిమిరపకాయ కారమునకతఁడు మొగము వాచి స్వయముగఁ జేసికొని మహాపదార్థముగ దాచికొని భోజనమునకు వెళ్ళినప్పుడు పొట్లముగట్టి తీసికొనిపోయి పంక్తిలోనున్న మహారాష్ట్రులు నివ్వెరపడి చూచి యితఁడు బ్రహ్మరాక్షసుడని తలంచునట్లది కలుపుకొని తినుచుండును. కొన్నినెల లగునప్పటి కతఁడు మహారాష్ట్ర భోజనమున కలవడెను. అలవాటు పడిన తరువాత మహారాష్ట్రులెవ్వరతని కందలేదు. పునహా వెళ్ళినతరువాత రెండు మూడు మాసముల కతఁడు వివాహము నిమిత్తము యోచన నారంభించెను. చదువు సంధ్యలురాని శుంఠయగుటచే రెండణాలు నాలుగు డబ్బులు రెండుడబ్బులు చేతులోఁ బెట్టినవారేకాని రూపాయ లిచ్చినవా రెవ్వరులేరు. దమ్మిడీకాసులెకాని పెద్దకాసు లతని చేత పడలేదు. ఆ కారణమున తానువిన్నట్లు మహారాష్ట్రులు గొప్పదాతలు కారని నమ్మిక తోఁచెను. ఎందుచేతనో మహారాష్ట్రులమీఁద నతనికి గొంత యనిష్టము గలిగెను. “మహారాష్ట్రులు మగవాండ్రు నాడువాండ్రు నను భేదము లేకుండ నందఱు వితంతువులె. మహారాష్ట్రుల కాచార వ్యవహార