పుట:Ganapati (novel).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42

గ ణ ప తి

నతఁడు గావించిన విచిత్రవివాదములు, హస్తలాఘవములు, లీలలు వర్ణింపఁ దొడఁగిన పక్షమునఁ బాఠకులకు విసుగుపుట్టునను భయమున నవి యెల్ల మానవలసివచ్చెను. బ్రాహ్మణుడెంత పేదవాఁ డైనను జేత నొక కాసుసయితము లేకుండ సేతుహిమాచల పర్యంతమగు దేశమంతయు దిరిగిరావచ్చును. ప్రతి పట్టణమున నున్న సత్రములు కొన్ని సత్రములలో నొక పూట మాత్రమే భోజనముఁ బెట్టుదురు. కొన్ని సత్రములలో రెండు పూటలు నిరుప్రొద్దు భోజనము పెట్టుదురు. కొన్ని చోట్ల భోజనముకాక కానియొ రెండుకానులో దక్షిణ గూడ నిచ్చెదరు. దక్షిణదేశమున కొన్ని సత్రములలో బాటసారు లగు వితంతువులు రాత్రి రొట్టె కాల్చుకొనుటకు పిండి గూడ నొసంగుదురు. సత్రములమాట యటుండఁగా బ్రాహ్మణుల కన్నము లేదను బ్రాహ్మణ గృహస్థులు సాధారణముగ నుండరు. కాబట్టి పాపయ్య చిల్లిగవ్వ చేతలేకుండ సుఖముగ వెళ్ళఁగలిగెను. ప్రాతఃకాలమునందు లేచి జాము ప్రొద్దెక్కు వఱ కతఁడు నడచి యొకగ్రామముః జేరి యచ్చట సత్రమున్న సత్రమును లేనిచో సామాన్య గృహస్థుల యిండ్ల భుజించి సుఖముగనిద్రించి మరల జాముప్రొద్దువేళ బయలుదేరి నడచి యేయూరికడ సాయంకాల మగునో యచ్చట బసజేసి యెవరి యింటనో భుజించి మరల వేకువను లేచి పయనము సేయుచుండును. ఈ విధముగ నతఁడు నాలుగు మాసము లగునప్పటికి సుఖముగ శ్రీమంతులగు పీష్వాలకు మున్ను రాజ