పుట:Ganapati (novel).pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

గ ణ ప తి

వానికి గావలసిన రసవర్గములు సంపాదించుట స్వగ్రామమున దుస్సాధ్యమయ్యెను. అదియునుంగాక వివాహముఁ జేసికొని వంశము నిలుపుకొన వలయునని గట్టిసంకల్ప మతనికిఁ గలిగెను; అతనికి విద్యఁజూచి పిల్లనిత్తురా? ధనముజూచి యిత్తురా? మళ్ళు మాన్యములు జూచి యిత్తురా? వరదిట్టము కావలసినంత యున్నది. కలియుగములో వరుని దార్ఢ్యము, సాంప్రదాయముఁ జూచు వారెవ్వరు? ఎల్ల పేదవాండ్ర విషయములో నయినట్లె పాపయ్య విషయమున వివాహము ద్రవ్యైక సాధ్యమయినది. ద్రవ్యము స్వగ్రామమున సంపాదించుటకు దగిన యనువులు లేవు. కాఁబట్టి దేశాంతరములకుఁ బోవలయునని పాపయ్యకు దృఢసంకల్పము గలిగెను. ఏ దేశమునకు బోవలయు నని యతఁడు మనస్సులో మీమాంసఁ జేసెను. కాశికిఁ బోవలయునని కొంతకాల మతఁడు తలంచెను. కాశిలోని సత్రములలో యధేఛ్ఛముగ భోజనము జరుగును. కాని వివాహము నిమిత్తము కావలసిన ధన మచ్చట దొరకదని యతని కెవ్వరోచెప్పి మహాపట్టణమందు దెనుఁగు బ్రాహ్మణులమీద నాదర మెక్కువగల దక్కడికిఁ బొమ్మని హితోపదేశము జేసిరి. ఆ మాట యతనికి నచ్చెను. తోడనే పునహాకు బ్రయాణమయ్యెను. అతని యింట లోకమంతట గల పంచభూతములే గాని యితరమైన యాస్తి యేమియునులేదు. పాత్రలు మృణ్మయపాత్రలు త్రాగుటకొక యిత్తడిచెంబు మాత్రమున్నవి. కట్టుకొనుటకు మూఁడు నాలు గంగవస్త్రములు