పుట:Ganapati (novel).pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనవి.

1963 నవంబరులో మా ప్రధమ ప్రచురణ “సూక్తిముక్తావళి” తో ఆరంభించి 13 పుస్తకములను ప్రచురించితిమి. కీ.శే. కళాప్రపూర్ణ చిలకమర్తి లక్ష్మీనరసింహంపంతులుగారి గ్రంధములు 11టిని వెలువరచి, ప్రస్తుతము ‘గణపతి’ పూర్తిగ్రంథము ప్రకటించుచున్నాము. ఇక 1966లో పంతులుగారి లఘుగ్రంథములు మరికొన్నిటినీ, జీవితచరిత్రలనూ వేయ దలపెట్టియున్నాము. చిలకమర్తి వారి గ్రంథములన్నీకూడ విశిష్టత గలట్టివే ఆంధ్రభాషకు, ఆంధ్రదేశమునకు అనన్యసేవ గావించిన ఈ మహానీయుని గ్రంధములు మంచి గ్లేజుకాగితముపై, తప్పులు లేకుండ, మంచిగెటప్ తో ప్రచురించి, తెలుగు దేశములోని గ్రంధాలయములకు వెలలేని భూషణగా యివ్వతలపెట్టిన మాకు గ్రంథాలయాధికారులందరూ తగుప్రోత్సాహ మీయగోరుచున్నాము. విద్యార్ధిదశలోనే చిలకమర్తివారి రచనలను చదివినవారు ఉత్తమపౌరులుగా తయారగుదురని నిస్సందేహముగా చెప్పనగును.

అంతేగాదు. 1987లో శ్రీ చిలకమర్తివారి శతవార్షికోత్సవము రానున్నది. అప్పటికి శ్రీవారి గ్రంధములన్నీ వెలువర్చదలచితిమి. వారి గ్రంథములులేని గ్రంథాలయము అసమగ్రమనుట సాహసము గాదు గాన గ్రంథాలయాధికారులు, కార్యకర్తలు, విజ్ఞులు యీ గ్రంథము లన్నీ తెప్పించి, తమ పాఠకుల కందించుటయే పంతులుగారికి మన మొనర్చు గౌరవము కాదగును. విద్యాశాఖాధికారులు ముఖ్యంగా యీ విషయములో చేయదగిన దెంతైన గలదని మా మనవి.

‘సూక్తిముక్తావళి’ ప్రథమ ముద్రణపు ప్రతులు రెండేండ్లలోనే పూర్తిగా ఖర్చగుటచేత దానిని పునర్ముద్రించ దలపెట్టితిమి. ఆంధ్రపాఠక