పుట:Ganapati (novel).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

37

శుద్ధిస్నానముఁ జేసి కొడుకు నొడిలో వైచికొని దేవతా దర్శనమునకుఁ బోవుచుండెను. అప్పుడొక బెబ్బులి యామెందఱిమెను. పాండురాజు పులి నొక యమ్మున గూల వేసెను. కాని యా లోపున నామె భయపడి విసవిస పరుగిడ నారంభించెను. ఒడిలోనున్న భీమసేనుఁడు నేలఁబడియెను. నెత్తురుఁ గుడ్డగుటచే బిడ్డ యా దెబ్బకు మృతినొందెనేమో యని కుంతీదేవి తత్తరపడియెను. కాని బాలుని దేహము కందలేదు. నలగలేదు. అతని శరీర సంపర్కము గలిగినంత మేర యా ఱాతినేల పిండి పిండి యయ్యెను. అతనియందు వలెనే పాపయ్యయందుగూడ బాల్యమున నతని జఠరాగ్ని శక్తి ద్యోతకమయ్యెను. దృష్టిదోషము తగులునని తండ్రి యితరుల కది వెల్లడింపలేదు. పాపయ్య పదియాఱేండ్ల ప్రాయము వాఁడైనపుడు తండ్రి కుమారుని వెంటబెట్టుకొని కోనసీమలోఁ బ్రయాణము సేయుచుండెను. చలిదికూడు లేక పాపయ్య యెక్క యడుగైన నడువఁజాలఁడు. అందుచేఁ దండ్రి ఆనాఁడొక యూర నొక యింటి కరిగి “అమ్మ! మా కుఱ్ఱవానికి రవంత చలిదియన్నము దొరకునా” యని యడిగెను. కుఱ్ఱవాఁడు చలిదియన్నము గోరుచున్నాఁ డనఁగానే సాధారణముగ లేదనువారుండరు. పాపయ్య పదియాఱేండ్ల వయసువాఁడైనను నప్పటికే తండ్రివలె చెయ్యెత్తు మనుష్యుఁడయ్యెను. అయినను జనకుని దృష్టి కతడు కుఱ్ఱవాఁడెకదా! కుఱ్ఱవాఁ డనుటచేత గృహ యజమానులు