పుట:Ganapati (novel).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

గ ణ ప తి

గర్భమందే జీర్ణకోశముండును; గాని పాపయ్యకు జీర్ణకోశము శరీర మంతట గల” దని పరిహాసాస్పదముగఁ బలుకజొచ్చిరి: కొందఱు దయ్యపుతిండియనిరి. అభాగ్యుల కాకలియెక్కువయని మఱికొంద రనిరి. చాటుచాటుననె గాని యతని యెదుటఁ బడి యెవ్వ రెట్టి మాట లనలేదుసుఁడీ. అతఁడు భోక్తగా వెళ్ళిన గృహమున శ్రాద్ధమునకు ముఖ్యమని పనసకాయ కూర వండిన పక్షమున వండిన కూరంతయు బాపయ్యయె భక్షించును. అతనిని బిలిచినప్పుడు గృహ యజమానులు గారెలు నరిసెలు సంతర్పణమునకు వండుకొన్నట్లు వండుకొనవలయును గాని సూక్ష్మముగఁ జేసికొనుటకు వీలులేదు. పైతృకములయందు సుష్టుగా భోజనము చేయువారిని బిలిచి పెట్టుట యెవరో కొందరికి సంతోషమైనను జన సామాన్యము కట్లుండదుగదా? పాపయ్యకు శ్రాద్ధభోజన మరుదగుట కది యెక హేతువయ్యెను. పాపయ్యయొక్క జీర్ణశక్తిని విస్పష్టముగఁ దెలియజేయుట కతని బాల్యమునఁ దండ్రి జీవించి యున్నపుడు జరిగిన యొక వృత్తాంత మిందు దెలుపుట సముచితము. భావికాలమున నేదో విషయమున మహా ప్రజ్ఞావంతులగు వారియం దా లక్షణాంకురములు బాల్యమునందె పొడచూపుచుండును. పాండవ సింహమని చెప్పదగిన భీమసేనుడు దుర్వార భుజబలశోభితు డని యెల్లవా రెఱుగుదురు కదా! ఆ మహాబల సంపత్తి యతని బాల్యమునందే గోచరమయ్యెను. కుంతీదేవి భీమసేనుఁడు పుట్టిన పదియవనాఁడు