Jump to content

పుట:Ganapati (novel).pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

360

గ ణ ప తి

చదువరులారా! మీ యదృష్ట మంతవరకె యున్నది. తన కథ యింతవరకు మాత్రమె చెప్పి యదృశ్యుఁడయ్యెను. అతఁడు మరల నగుపడి యనంతర చరిత్రము చెప్పిన పక్షమున నది గూడ నిట్లె లిఖించి మీ కానందము గలిగించెదను. ప్రస్తుత మింతటితో దనివినొందుఁడు. అతడు కనబడక పోయిన పక్షమున నంతకంటె నొక యక్షరమైన లేదని నమ్ముఁడు.

సమాప్తము.

లలితా ప్రింటింగ్ వర్క్సు, మెయిన్ రోడ్, రాజమండ్రి-2