పుట:Ganapati (novel).pdf/353

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

352

గ ణ ప తి

గంటులుపడెను. తరువాత గణపతియు శిష్యులును గలిసి శవమును దీసికొనిపోయి నట్లామెను వీధిలో నున్న పెద్దనూతికడకు దీసికొని పోయి బిందెలతో నీళ్ళుతోడి పోసిరి. ఆమెయు దనకు బిచ్చి లేదని పలుమారులు మొఱ్ఱపెట్టుకొన్నను నవి యెల్ల పిచ్చిమాటలేయని గణపతి 'సరకు సేయక పోయండి నీళ్లు పోయండి ' యని మాతౄణము దీర్చికొనెను. అంతటితో గణపతికి దల్లిపై నున్న యక్కసు తీరిపోయెను. నాటంగోలె సింగమ్మ తనయుని గృహమువిడిచి గ్రామమున వారింటను వీరింట నేవో పనిపాటలు చేయుచు గాలక్షేపము సేయజొచ్చెను. కొడుకు నలుగురను పోగుచేసి తనకు బిచ్చి యని నీళ్ళుపోయించునని తల్లియు, దల్లి పదుగురను బోగుచేసి తన కున్మాదమని చెప్పి కాలువకడ స్నానము చేయించునని కొడుకును నొండొరులకు భయపడ జొచ్చిరి. పిమ్మట మాతాపుత్రు లెన్నడు గలుసుకొనలేదు. మహాదేవశాస్త్రిగారి తల్లియు మరికొందరు బ్రాహ్మణు వితంతువులు రామేశ్వరయాత్ర వెళ్ళదలచి తమ కేవైన పనిపాటులు చేయుచుండునని సింగమ్మను వెంట రమ్మనిరి. ఆమె భోజనము గడచుటయే గాక యాత్రాఫలముగూడ దక్కునని వారి వెంట బయలుదేరెను. ఆమె తిరుపతి శ్రీరంగము మథుర రామేశ్వరము మొదలైన మహాక్షేత్రములు చూచి తిరిగి వచ్చునపుడు మార్గమధ్యమున శ్రీ కుంభకోణ క్షేత్రమునందు విషూచిజాడ్యముచే మృతినొందెను. ఆమె గోదావరీతీరమునందే మృతినొందవల నని మొదటి