పుట:Ganapati (novel).pdf/35

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

34

గ ణ ప తి

నొక్కరికైన లేకపోయెగదా! అందుచేత వీరు పాపయ్యతో బోల్సఁ దగరు. అట్టి యద్వితీయ భావ మతని కుండుటచేతనే పాపయ్య చరిత్ర మక్షరరూపముగ నాంధ్రదేశమున ప్రచార మగుచున్నది. అట్టిభావము శూన్య మగుటచేతనే మందపల్లి గ్రామవాసులలో ఘనులగు తర్కవ్యాకరణ జ్యోతిశ్శాస్త్ర పండితులున్నను వారి చరిత్రములు లిఖింపఁ బడుచున్నవా? గ్రామస్తులు చేసిన యల్లరి వలన వివాహయోగ్య వయస్కుఁడైన పాపయ్యకుఁ బిల్ల నిచ్చుట కెవ్వరు రారైరి. తన కుమారునకు వివాహము కాలేదని విచారించి విచారించి తల్లి కాలధర్మము నొందెను. ఆధీనము తప్పిన యాడుపడుచులు గాని మఱి యే యాడుదిక్కుగాని లేకపోవుటచే నతఁ డప్పు డప్పుడు వంట జేసికొనవలసి వచ్చెను. బ్రాహ్మణార్థముల వలన నతఁడు పొట్టబోసికొనఁ గలఁడు. కాని యందు మూఁడు నాలుగు చిక్కులు సంభవించినవి. మున్నూట యఱువది దినములు భోక్తయై యుండుటకు గ్రామమున మూడువందల యఱువది శ్రాద్ధములు లేవు. ఆ కాలమున మందపల్లిలోనున్న బ్రాహ్మణ గృహములే నలుబది యేఁబది, ఇంటికి రెండాబ్దికములకన్న నెక్కువగా నుండవు. అదియును గాక ప్రతివారు పాపయ్యనే పిలువరుద కదా? పిలువఁ దలంచుకొన్నవారు గూడ నితఁడు కలహప్రియుఁడని యెంచి పిలుచుట మానిరి. వస్త్రమీయ లేదనియొ దక్షిణ స్వల్పముగా నిచ్చినారనియొ నతఁడు గృహ