పుట:Ganapati (novel).pdf/346

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

345

"మొగమున గళ్యాణము బొట్టు, కన్నులకు గాటుక, కాళ్ళకు పసుపు పారాణి లేకపోయిన పక్షమున పెండ్లి కొడుకున కుండవలసిన లక్షణము లుండవు గనుక తప్పక నవి యన్నియు నుండవలె" నని చెప్పెను. అది గణపతికి సహేతుకముగాఁ తోచినందున బాదములకుఁ బారాణియు, నేత్రంబులకు గజ్జలంబును బెట్టుమని తల్లి నడిగెను. ఇంతమాత్రపు ముచ్చటయైన దాను బ్రతికియుండగా దన కన్నుల బడినదని సంతోషించి యతఁడు మరచిపోయిన బుగ్గచుక్క గూడ బెట్టెను. ఊరేగింపైన తరువాతే భోజనము జేయుదు నని గణపతి యా పూట భోజనమే చేయలేదు. గణపతి యా దినమున నూరేగునను వార్త పొక్కుటచే గ్రామవాసులంద ఱా యుత్సవము గన్నులార జూచి యానందింపవలె నని తమ తమ పనులెల్ల పెందలకడ ముగించి దీపములు పెట్టినతోడనే భోజనములు చేసిరి. చిన్నపిల్లలు సైతము నిద్రపోవరైరి. మగవాండ్రందరు గణపతి యింటిముందర రాత్రి నాలుగు ఘడియల ప్రొద్దుపోవు నప్పటికి తీర్థప్రజలవలె జేరిరి. ఆడువాండ్రందరు గృహకృత్యములు పెందలకడ నిర్వర్తించుకొని యూరేగింపు చూచుటకు వీథులలో గూర్చుండిరి. రాత్రి జామగునప్పటికి యూరేగింపు ప్రారంభమయ్యెను. గణపతికి రెండు విచారములు మాత్రము పట్టుకొనియెను. భోగముమేళము లేకపోవుట యొకటి, బాణాసంచా లేకపోవుట యొకటి. ఆ విచారము పూర్వవిద్యార్థులకు తెలుపగా నిజమైన వివాహమున కా రెండు వెలితిలు బూర్తి