పుట:Ganapati (novel).pdf/345

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

344

గ ణ ప తి

నేనేమి వెఱ్ఱి వెంకటాయ ననుకొన్నారా యేమిటి? ఇరివరకిన్ని పెళ్ళిళ్ళైనవి గాని యీ గ్రామములో పల్లకిలో యింత డాబుగా కూర్చున్న పెండ్లికొడుకు లేడురా, వీడు కడుపుకాలా! వీ డసాధ్యుడురా! యని లోకు లందరు చెప్పుకొనునట్లు కూర్చుండ గలనో లేదో చూడండి. వెళ్ళండి. మీ పనిమీద మీరుండండి!" అని బడి కాదినము సెలవిచ్చెను. విద్యార్థులు వాని కడ సెలవుగైకొని తిన్నగా చాకలిపేటకు బోయి యొక పల్లకి గుదిర్చి రాత్రి యెనిమిది గంటలకు రమ్మని చాకలి వాండ్రతో జెప్పిరి. తాషాజోడు రమడోలు మేళము గుదిర్చి తక్కిన భజంత్రీల నేర్పరచిరి. ఒక డెఱ్ఱజరీ తలగుడ్డ తెచ్చిపట్టీలు పైకుండునట్లు చుట్టి యతని తలపై బెట్టి యది సరిపోవునో లేదో యని నాలుగైదుసారులు చూచిరి. గణపతి పెద్ద యద్ద మొకటి తెప్పించుకొని తనమొగ మందులో చూచుకొని సంతోషించెను. నాలుగైదు పట్టుకోట్లు తెచ్చిరి. గని యవి యన్నియు వాని బొజ్జకు సరిపోవయ్యెను. ఎన్ని కోకలు చుట్టినను హనుమంతుని తోక మిగిలియున్నట్లే యెంతెంత పెద్దకోట్లు తెచ్చినను గణపది బొజ్జ మాత్రము మిగిలియే యుండెను. చిన్న పొణకతో యాముదపు సిద్దెకో కోటు తొడిగినట్లుండెను. కాని మనుష్యునకు తొడిగినట్లు లేదు. సరివిగాని దయవల్ల జరీపంచయు నుత్తరీయము లభించెను. ఆ పంచ గట్టుకొని యాకోటుమీద నా యుత్తరీయము వైచికొని తలపాగ దాల్చి పల్లకి యెప్పుడు వచ్చు నెప్పుడువచ్చు నని యూరేగింపు టుత్సవమున కుబలాట పడుచుండగా నొక విద్యార్థి