పుట:Ganapati (novel).pdf/340

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

339

నా నంటే నీ కిల్లున్నదా? వాకిలియున్నదా? యని ప్రశ్నలు మొదలుపెట్టుదురు. ఆ ప్రశ్నలకు నేను జవాబు చెప్పలేను." తన యాస్తిసంగతి యెవఁడైన నెత్తినపక్షమున నతని కమితాగ్రహము వచ్చునని యిదివరకే వ్రాసియుంటిమి. తల్లి పలుకులు వినఁగానే నతఁ డతికోపము జెంది "శకునపక్షి ముండా! పెండ్లిమాటలకు వెళ్ళిరావే యంటే యిల్లున్నదా వాకిలియున్నదా యని వారడుగుతా రని లేనిపోని శంకలుపెట్టి పాడుమాట లాడుచున్నావు. బోడిముండా? నీ మూలముననే నాకు పెండ్లి కాలేదు. ఇల్లు వాకిళ్ళు పుట్టగానే లోకు లందరు పట్టుకువచ్చారా యేమిటి? నీవే నాకేమియు లేదని ముందుగా ప్రేలుచుంటే పిల్లనిచ్చేవా రనరా యేమిటి? పిశాచపు ముండా! కోడలు రానీ. నిన్ను వీథులోనికి కుక్క నీడిపించిన ట్లీడిపించక పోతానేమో చూతువుగాని?" యని కోపమాపుకొనలేక యా విస్తరి రెండుచేతులతో నెత్తి తల్లి నెత్తిమీఁదపెట్టి రుద్ది, వీపుమీఁద రెండు చరుపులు చరిచి లేచిపోయెను. "అయ్యో! నే నేమన్నానురా? నీ పెండ్లి పేలాలు వేగిపోను! నా జోలికి రాకురా, ఇఁకమీద నీ పెండ్లిమాట నేనెత్తనురా, బాబూ! యని తన తల యంటుపడెను. గావున నూతికడకు బోయి యామె స్నానము చేసెను. సింగమ్మకు మంచి పాటలు గాని పద్యములు గాని రావు. కాని అప్పుడప్పుడు యేవో కూని రాగములు తీయుచుండును. ఆమెకు రామదాసు చరిత్రము మిక్కిలి యిష్టము. అప్పుడప్పుడు బైరాగులు భిక్షాటనము