పుట:Ganapati (novel).pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

329

శాస్త్రి కిచ్చి, పైడిపిల్లిం జేయించు మని కోరెను. కాని కా సాగ్రామమున దొరకలేదని కొంతకాలము, కంసాలి చేయలేదని కొంతకాలము, తూనిక వేయ లేదని కొంత కాలము జరిగి గణపతి యా గ్రామమున నుండగా సువర్ణ మార్జాలము నతనికి జూపలేదు. గణపతి చందావలన దెచ్చిన రాగిడబ్బులు; వెండి బేడకాసులు, పావులా కాసులు చేతబడవైచి నప్పుడే యనియె రాగిపిల్లు, వెండి పిల్లులు నని మహాదేవశాస్త్రి మనస్సులో దలంచుకొని యాపిల్లుల నెప్పటికప్పుడె భక్షించుచు వచ్చెను. కాని బంగారుపిల్లిని జేయించదలఁచుకొననే లేదు.

బంగారుపిల్లి గొడవతో నిట్లు కొంతకాలము గడచిన పిమ్మట నొకనాడు గణపతి, అతని యింటికి రాత్రులు పండుకొన వచ్చు పెద్దవిద్యార్థులు కొందఱును గలిసి కాలువదగ్గఱకు షికారు బోయి, యయ్యది వేసవికాల మగుటచేఁ దెల్లవాఱు జామున లేచి ప్రతిదినము స్నానము చేయవలయు నని నిశ్చయించుకొనిరి. కాని దీని కొక్కచిక్కు గనబడెను. గణపతికి మెలకువ వచ్చుట యసంభవము, ప్రతిదినము జాము ప్రొద్దెక్కిన తరువాత లేచు గణపతి జాము తెల్లవారగట్ల లేచుట యన యర్థ రాత్రమున సూర్యోదయ మగుటయె. శిష్యుల ముందె మేల్కని పిదప గురువును లేపవచ్చునని వారిలో నొక్క డాలోచన చెప్పెను. తెల్ల వారుజామున శిష్యులకు ముందు మెలకువ వచ్చుట యెట్లని వారిలో నొకనికి సందేహము తోఁచెను. గురువుగారి దగ్గరునున్న