పుట:Ganapati (novel).pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

గ ణ ప తి

వాసము లేకయె శుశ్రూషాపీడ లేకయే యెందఱు బహువిద్యలలో నధికప్రౌఢులైరని మనము వినుచుండుట లేదు. తన విద్యావిషయమున మన పాపయ్యయు నట్టి పట్టికలో జేరఁదగినవాఁడెసుఁడీ. ఇట్లనిన మీరు నమ్మక నవ్వ మొదలు పెట్టెదరు. వాల్మీకి ఛందో వ్యాకరణాది లక్షణ జ్ఞానము గురుబోధలేకయే సముపార్జించె నన్న మీ రహహా యని నవ్వి యానందింతురు. భాగవత ప్రణేత యగు పోతరాజు సహజ పాండిత్యము గలవాఁడని చెప్పినంత మాత్రముననె విశ్వసింతురు. సహజ పాండిత్య మొకరిసొమ్మా? ఈ విద్య యావిద్య యనకుండ సకలవిద్యలలో వారి వారి పూర్వజన్మవశముననో యదృష్టవశముననో సహజ పాండిత్య ముదయించుచుండును. కాఁబట్టి పక్షపాతము మాని పాపయ్యకు గూడ విద్యలో నట్టి ప్రతిభా విశేషము గలదని నమ్ముఁడు. అతని పుణ్యమేమో కాని పాపయ్యకు బాల్యము నుండియు నద్వైతసిద్ధి సహజముగానె గలిగినది. ఎంతెంతో శ్రమపడి యెంద రెందరో గురువులకు శుశ్రూషఁ జేసి శంకరభాష్య సమేతముగ దశోపనిషత్తులు భగవద్గీతయు బ్రహ్మసూత్రములు వల్లించిన మహానుభావులకె స్థిరమైనయద్వైతభావము సార్థక మందైనఁ గలుగుట మిక్కిలి కష్టము. అట్టియెడ నూనూగుమీసాలు మొలకలెత్తక మునుపె యుపనయనమైన గాక మునుపె గోగణము విడిచి యంగవస్త్రమును గట్టక మునుపె మాటలైనను సరిగరాకమునుపె స్వవస్తు పరవస్తు