పుట:Ganapati (novel).pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

328

గ ణ ప తి

కొడుకులతో నిట్లనియెను. "బంగారు పిల్లిని చేయించుటకు గ్రామస్థులు చందా లిచ్చెద మని చెప్పినారు కదా. ఆ చందాలు మీరు పుచ్చుకొన్న పక్షమున నప్పటి కప్పుడే పులుసులో పడిపోవును. అవి ప్రోగుచేసి నా చేతి కివ్వండి. శాస్త్రప్రకారము చచ్చిపోయిన పిల్లి యెంత యున్నదో అంత పిల్లిని చేయించి దాన మీయవలెను. మన మనమంతవఱకు శక్తులము గాము గనుక చందాల సొమ్ము పెద్దకాసువఱకు జేరిన తోడనే శాస్త్ర సంతృప్తికొఱకేదో విధముగా నొక చిన్నపిల్లిని చేయించి యొక బ్రాహ్మణుని చేతిలో బెట్టుదము. పిల్లిదానము తిలదానముకంటె చెడ్డది. అది యెవరు బట్టరు. ఏదో విధముగ నేనే యేర్పాటు చేయుదును లెండి, మీరు భయపడకండి" అని చెప్పిపోయెను.

మహాదేవశాస్త్రి ఉదయమున జేసిన ప్రథమోపన్యాసమును బట్టియు రాత్రి గావించిన ద్వితీయోపన్యాసమును బట్టియు నతఁ డేలాగైన గణపతిని దోష విముక్తుని జేసి, పిల్లిదాన మెవరు బట్టకపోయినను దానైనను యా దానమును బట్టి యాతని నొకదరికి జేర్పవలయు ననియు సంకల్పించి నటులు స్పష్టముగ దెలియుచున్నదికదా. ప్రాణభయముచేత గణపతి ప్రతిదినము నిద్ర మేల్కొనగానే నలుగురునో యైదురుగునో గృహస్థులను జూచి చందా నడిగి తన చుట్టముక్కల కందులో గొంత మిగుల్చుకొని తక్కినవి మహాదేవశాస్త్రిగారి చేతి కిచ్చుచుండును. అట్లొక మాసములో నొక కాసు పోగుచేసి యతఁడు