పుట:Ganapati (novel).pdf/319

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

318

గ ణ ప తి

గాడు, మద్దెలగాడు, శ్రుతిగాఁడు, గరుడాచలము నేలబడుటకుఁ గారణ మెఱుగుదురు. కాని గుట్టు బయటబెట్టుట వారి కిష్టము లేదు. కావున హాస్యగాఁడు ముందుకువచ్చి గుండె బాదుకుని "మహాప్రభూ! దుర్మార్గు లెంత పని జేసినారో, చిత్తగించండి ! గరుడాచలముయొక్క చక్కదనము, సంగీతము, భామవేషము లోని ప్రజ్ఞ చూచి యోర్వలేక యెవఁడో పాపాత్ముఁడు ప్రయోగము చేసినాఁడు. నేలబడిపోయినది. మేము దేశద్రిమ్మరులము గనుక మా దగ్గర వీనికి బ్రతిక్రియలున్నవి. ఇంత మాత్రముచేత భయము లేదు. కాని యిఁక నీ రాత్రికి భాగవతము సమాప్తము. పాప మది రేపు మధ్యాహ్నమువఱకు లేవలేదు. మహాప్రభూ, ఈ వేళకు సెలవిప్పించండి. రేపు రాత్రి యిటువంటి దొంగదెబ్బ తీయునట్టి దుర్మార్గులకు దొరకకుండ జాగ్రత్తపడి, తిరిగి భాగవతము గట్టెదము." అని వేడుకొని గరుడాచలమును తీసికొని పోయెను. వాని పలుకులు సత్యంబు గాదలచి యెవఁడో నిజముగఁ బ్రయోగము చేసినాడని నమ్మి ప్రేక్షకులు వానిని నోటికి వచ్చినట్లు తిట్టిపోయిరి. మరునాడు మరల భాగవతము జరిగెను. కొత్తపేటలో జరుగబోవు భాగవతమునకు రమ్మని యదివరకె గణపతి తన స్నేహితులకు వర్తమాన మంపెను. అందుచే హాయిగా భాగవతము జూచుటకు గణపతియొక్క కోర్కె నెఱవేర్చుటకును మందపల్లి వాసులలో బనిపాటులు లేని పడుచువాండ్రి పదిమంది వెళ్ళిరి. చదువురాని యాడు