పుట:Ganapati (novel).pdf/315

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

314

గ ణ ప తి

ఈ బడిపోగానే మరేపని సంపాదించుకొనలేకుండుటకు నేనంత వెధవననుకొన్నారా? గణపతంటే సామాన్యుడు గాడు, వీఁడు మైరావణుఁడని మీకు యిప్పుడైనా తెలిసిందా? దాని భాగవతములో కృష్ణవేషము వేయఁగల యదృష్ట మెంతవానికిఁ బట్టును? వేదం జదువుకొన్న వెఱ్ఱినాగన్నలకు, శాస్త్రాలు నేర్చుకొన్న సన్యాసులకు, పెద్దవాళ్ళమని తెగనీల్గే పెద్దన్నయ్యలకు ఈ యోగము పట్టునా? నా యదృష్టముచేత నాకు పట్టినది. "అని త్రైలోక్య సామ్రాజ్య పదవి తనకుఁ జేకురినట్లు సంతసిల్లుచు నతఁడు పలికిన యా వెంగలి పలుకులు విని వారు ముసిముసినవ్వులు నవ్వుకొని "నిజముగా నీ యదృష్టము చేతనే దాని సేవ లభించినది. ఈ గ్రామములో నింతమందియున్నారు, వారి కెవరికైన లభించినదా? అందొక్కొక్కరి పూర్వజన్మ పుణ్యమువల్ల వచ్చుచుండును. 'ముఖేముఖే సరస్వతీ' అన్నారు. నీ ముఖము చూడఁగానే గరుడాచలము నీచేత శ్రీకృష్ణమూర్తి వేషము వేయించి, తాను భామవేషము కట్టి "రారా నందకుమారా రారా నవనీతచోర!" యని నీ బుగ్గమీఁద చేయివైచి ధన్యురాలు కాదలఁచుకొన్నది. ఇంతకు దాని యదృష్టము మంచిది. కానియెడల నీవంటి బ్రాహ్మణోత్తముఁడు దానికి వేయి జన్మములు తపస్సు చేసినను దొరకునా? మమ్మది చేర్చుకొన్న పక్షమున నాల్గు వరాల సొమ్ము దాని కిచ్చికొందుము. లంచ మిచ్చినను మమ్ములను జేరనియ్యదు. నీ ముఖారవిందము చూడఁగానే యది నీ వలలోఁ బడినది" యని