పుట:Ganapati (novel).pdf/312

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

311

వివేకజ్ఞానము గలవాఁ డగుట చేతను, వికృతచేష్టలు గాని విపరీత లక్షణములు గాని యతనికడ లేకపోవుట చేతను, మంచి బోధన శక్తి గలవాఁ డగుటచేతను, విశేషించి వినయాది సద్గుణములు గలవాఁ డగుటచేతను, గ్రామవాసుల కతని యెడఁ గ్రమక్రమముగ నభిమాన ముదయించెను. తమ బిడ్డల నతని పాఠశాలకంపి వారా యభిమానము స్థిరముజేసిరి. కాలక్రమమున గణపతి బడి వట్టిదయ్యెను. అందుచేత నతఁడు జీవనాధారము లేక మఱియొక వృత్తి నేదైన స్వీకరింపవలె నని యాలోచించుచుండగా శివరాత్రి కా యూరికి భాగవతులు వచ్చి భాగవత మాడిరి. పలివెల నుండి యెండమూరి గరుడాచల మను వేశ్యాంగన, యా భాగవతములో సత్యభామ వేషము గట్టెను. ఆ భాగవతము గణపతి చూచి మిక్కిలి సంతసించి మఱునాడు వేశ్య లున్న బసకుఁ బోయెను. అతఁ డచ్చటఁ గూర్చున్న సమయమున మేళనాయకురాలైన గరుడాచలము, దాని తల్లియగు పాపాచలము, మద్దెలవాఁడు సారంగు వాయించువాఁడు హాస్యగాడు మున్నగువాండ్రందఱు కృష్ణవేషగాఁడు తగినవాఁడు దొరకలేదనియు, స్థిరముగాఁ దమవద్ద నుండునట్టి కృష్ణవేషగాడు దొరకిన పక్షమునఁ దమ మేళము మిక్కిలి బాగుండు ననియు జెప్పుకొనిరి. అది విని గణపతి గరుడాచలమువంటి సరసురాలు సత్యభామ వేషము వేయుచున్నప్పుడు తనవంటివాఁడు కృష్ణవేషము వేసిన పక్షమునఁ దన జన్మము ధన్య మగు ననియు