పుట:Ganapati (novel).pdf/311

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

310

గ ణ ప తి

కులకు గూడ విస్పష్టముగ దెలియుటచేతను బడి క్రమక్రమముగఁ క్షీణించెను. గణపతి చేష్టలు జూచి నవ్వఁ దలచినవారును, వినోదముగఁ గాలక్షేపము సేయఁ దలఁచిన వారు మాత్రమే యతని చుట్టుఁ జేరజొచ్చిరి. బాలకుల సంఖ్య క్షీణీంచినను బెద్దవా రనేకులు సయితము తమ కేదియు దోచనప్పుడు బడిలేనప్పుడు నతని బడికిఁబోయి కూర్చుండి యాతని మర్కటచేష్టలు నసందర్భప్రలాపములు విని యానందించుచు వచ్చిరి. బడి నిండుగా నున్నప్పుడు జీతములక్రింద బాలకుల దలిదండ్రులు ధాన్యము, కందులు, కూరలు మొదలగు వస్తువులు పంపుటచేత నతని యింట నిబ్బంది యంత విశేషముగ లేకపోయెను. అంతియెగాక దెబ్బలు తినలేక బాలకులు తెచ్చి యిచ్చు లంచములచేత గూడ కొంతకాల మతనికి దారిద్ర్యము లేకపోయెను. కాని ముగ్ధభావము దాచిపెట్టిన దాగునది గాదు. కనుక క్రమముగ బయలుపడి యాతనియందించు కేనియు గౌరవము లేకుండునట్లు చేసెను. గ్రామవాసులలోఁ గొందరు తమ బిడ్డలకు విద్యాభ్యాసము జేయించునట్టి మంచి యుపాధ్యాయుఁడు లేనందున విచారించి క్రొత్తపేట వెళ్ళి యచ్చటినుండి యొక యుపాధ్యాయునిఁ దీసికొనివచ్చి మఱి యొక యఱుగు మీఁద బడి పెట్టించి, తమ బిడ్డల నచ్చటికిఁ బంపదొడంగిరి. గణపతియం దే కారణముచేతనో యభిమానమున్న వారు కొందఱు మాత్రము తమ పిల్లల నితని బడికే యెప్పటియట్ల బంపుచుండిరి. క్రొత్తగా వచ్చిన పంతులు యుక్తాయుక్త