పుట:Ganapati (novel).pdf/303

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

302

గ ణ ప తి

వాఁడను నేనిక్కడ కేల వచ్చితిని. నారాయణ! నారాయణ! నన్నీ కటుకుమీఁద పండుకోబెట్టినవాఁరెవరు! ఇదేమిటి నన్ను వల్లకాటికి దీసికొని వచ్చినారు. ఏరీ ! రాత్రి నా ప్రక్కను బండుకొన్న పిల్లవెధవలు! నన్నెవరో యీలాగున తీసుకువచ్చుచుండఁగా నా ప్రక్కను పండుకున్న కుఱ్ఱవెధవలు భయపడి పారిపోయినారు గాఁబోలు?" అని లేచి నిలిచెను. పంతులుగారి నెవ్వరు చంపఁ దలంచుకో లేదనియు నెవరో కోపముచేతనో, కొంటెతనముచేతనో నీ విధముగా జేసినారని నచ్చటఁ జేరిన గ్రామవాసు లందరు నిశ్చయించిరి. పదిమంది పెద్దమనుష్యులను బ్రోగుచేసి పోలీసువారికి వర్తమాన మంపించి, భోజనములు లేకుండ మూడు జాములదాక గూర్చుండి పంచాయితీ చేయనక్కరలేకుండ వ్యవహారము చులకనగా తేలినదని మునసబు కరణములు సంతోషించుచు నింటికిఁ బోయిరి. "తమ మరణాంతరము బంధువులు తమ నిమిత్త మెట్లు విలపింతురో చెవులార వినియెడిభాగ్య మెవ్వరి కబ్బదు! గణపతి కట్టి మహోత్సవము తీరిన" దని నవ్వుకొనుచు, గ్రామవాసుల నందర నచ్చటికిఁ జేర్పఁ గలిగిన యీ పన్నాగము పన్నినవారి బుద్ధికుశలత మెచ్చుకొనుచు, గ్రామీణులు "వహవ్వా ! యేమి పంతులయ్యా ! ఎందరనో పంతుళ్ళను చూచినాము గాని యింత విపరీతపు పంతులును చూచినాము కాము. మన యదృష్టము కొద్ది దొరికినాఁడుగాని" యని పరిహాసాస్పదమగు పలుకులు పలుకు