పుట:Ganapati (novel).pdf/297

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

గ ణ ప తి

వాడు కాడు. వీథిలో బండు కొన్నపుడు సూర్యకిరణములు మొగము మీద బడి కన్నులలో దూరి తాళముచేతులు తలుపులను దెఱచినట్లు ఱెప్పలు విప్పిన గాని లేచుటలేదు. మనమిక్కడ గొంతసేపుండి తెల్లవారుజామున నింటికి వెళ్ళుదము." అనవుడు నతని మాటలు తమ ప్రారంభమున కనుకూలముగా నున్న వని వారందఱు నిశ్చయించి, పంతులవారి యాకారము చక్కదనము నాకారమునకుఁ దగిన ప్రజ్ఞలు గుణగణములు చెప్పుకొని కడుపులు పగులునట్లు నవ్వి కాలక్షేపముజేసిరి. అటకమీద గూనకు జేరబడి పండుకొన్నప్పుడు గణపతి కెంత సుఖముగా నిద్రపట్టెనో కటుకుమీద బండుకొన్నప్పుడు నంత సుఖముగానే నిద్రపట్టెను. నిద్రపోయినవారును జచ్చినవారును సమాన మన్న సామెత యొకటి యున్నదిగదా! ఆ సామెత గణపతికడ నిజమయ్యెను. ఎన్నడో చచ్చిన యట్లతఁడు మైమఱచియుండెను. కడపటిజాము కోడి కూయు వఱకు శిష్యులు గురువుం గనిపెట్టుకొనియుండి, కాపులు మొదలగువారు పొలముల కా దారినే దెల్లవారుజామున బోవుదుదు గనుక దా మచ్చట నిక యుండగూడ దని లేచి గ్రామమునకుం బోయి యెవరి యింటికి వారరిగిరి. కాకులు గూసెను. తూర్పుదెస తెల్లవాఱెను. ఆడవాండ్రు ముందుగ లేచి ముంగలివాకిళ్లు వీథియరుగులు గుమ్మములు తుడుచుకొనఁ జొచ్చిరి. కనుచీకటి యుండగానే యొక కాపువాడు వల్లకాటి మీదుగా దన పొలమునకు కరుగుచు నచ్చట కటుకుపై నున్న శవముం జూచి "హా ! యేమిది చిత్రముగ నున్నది. శవము