పుట:Ganapati (novel).pdf/285

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

284

గ ణ ప తి

డబ్బులు కనపడకపోయెను. ఎవరో దొంగలు వచ్చినారని గోల బయలుదేఱెను. ఇంటిదొంగ నీశ్వరుఁడైన బట్టుకొన లేడుకదా! ఇట్లగుటచేట బెత్తమునకు బొత్తిగా పని తప్పిపోయిన దని మీరనుకొనవద్దు. ముడుపులు తెచ్చుటకు శక్తిలేని నిర్భాగ్యులగు బాలకులమీఁద దండము ద్విగుణముగఁ బ్రయోగింపబడుచు వచ్చెను. కార్తవీర్యార్జునుఁడు మొదలగు మాహావీరులు బాహువుల తీట తీరుటకయి లేనిపోని కయ్యములు కల్పించిన విధమున గణపతి తన చేతుల తీట తీరుటకు గొట్టవలయు నను ముచ్చట తీరుటకు నెన్నో వంకలు కల్పించి కానుకలు తేజాలని పేదబాలకులను చిత్రవధ చేయ నారంభించెను. ఆ పీడ తప్పించు కొనుటకయి వారు గూడ బహు విధోపాయముల నన్వేషించి గురు ప్రీత్యర్థము కానుకలు తెచ్చుటకయి చిన్న చిన్న దొంగతనములు చేయ నారంభించిరి. వీథిలో నెండబోసిన వడ్లు దొంగిలించిన వారు కొందఱు, దుకాణములో గూర్చుండినట్లె గూర్చుండి డబ్బులో సరకులో దొంగిలించెడు బాలురు కొందరు,అప్పుడప్పుడీ బాలకు లలవాటు లేని దొంగతనమున బట్టువడ పంతులువారి చేతినుండి తప్పించుకొనదలచిన శిక్ష, వస్తువుగల యజమానుల చేత పడజొచ్చిరి.

గణపతియొక్క చిత్రచేష్టలు విని యింతకు మున్ను చదువుకొనుట కిష్టము లేనివారయ్యు విద్యాభ్యాసమునం దెక్కడ లేని తమకము గలవారై మొట్టమొదట వినయ