పుట:Ganapati (novel).pdf/282

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ ణ ప తి

281

చోటు తియ్యగా నుండును. తక్కినవారి యడుగులు చప్పగా నుండును. ఆ యడుగుల తీపినిబట్టి వారున్నచోటికిఁ బోయి మెల్లగ కాటువేయును. అందుచేత పాముపగ గలవాఁడు తిన్నగా నడువక వంకరటింకరగ నడువవలెను. అప్పుడు పాముగూడ వంకరటింకరగ నడచును. ఆలాగున నడచిన యెడల దాని యెముకలు విరిగిపోవును. ఒకప్పుడు పాముపగ గలవాఁడు నడవక బండెక్కి గాని మనుష్యుల భుజమెక్కి గాని వచ్చుట మంచిది. అడుగుల జాడ లేదు గావున వాఁడున్న చోటికి పాము రాఁజాలదు."

ఆ తెఱంగున నతఁ డెల్ల విషయముల దనకుగల జ్ఞానము లోకహితార్థముగ వెలిబుచ్చు చుండును. అతని కే విషయమున నెంత జ్ఞాన మున్నదో, యది యెంతవరకు యదార్థమైనజ్ఞానమో, తమ బిడ్డల కతడు విద్య చెప్పుచున్నాడో లేదో, యితని పాఠశాలకుఁ బోయినందునఁ దమ బిడ్డ లెంత బాగుపడు చున్నారో తెలిసికొనువారు గ్రామస్థులలో ననేకులు లేరు. అట్టివాఁడు నూటి కొకఁ డుండవచ్చును. తన పిల్లవానిని మిక్కిలి కఠినముగ శిక్షించినాఁడని యిద్దఱు ముగ్గురు గణపతితో వివాదపడిరేగాని చదువు విషయములో వివాదపడువా రరుదు. 'పంతులుగారు మాకు సరిగా పాఠములు చెప్పుటలే ' దని కొందఱు పిల్లలు తల్లిదండ్రులతో మొఱపెట్టుకొనిరి. కాని యా మొఱలు తల్లిదండ్రుల మనస్సున కెక్కలేదు. పంతులుగారిమీఁద గిట్టక బిడ్డలు లేనిపోని నేర